నాగబాబు కి కావలసిన కాంట్రవర్సీ మెటీరియల్ దొరికింది!

బాలయ్య నాగబాబు నిప్పు, ఉప్పు అన్న సంగతి తెలిసిందే. గతంలో బాలయ్య చేసిన వ్యాఖ్యలపై కొన్ని వరుస ఎపిసోడ్స్ నాగబాబు చేయడం జరిగింది. ఇక 2019 ఎలక్షన్స్ ఫలితాల తర్వాత నాగబాబు బాలయ్యపై పెద్దగా ఎపిసోడ్స్ చేసింది లేదు. ఐతే చాలా కాలం తర్వాత నాగబాబుకు బాలయ్యపై ఎపిసోడ్స్ చేసే అవకాశం అవకాశం దొరికింది. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన బాలయ్య కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ తో హైదరాబాద్ భూములు పంచుకుంటున్నారా అని కామెంట్ చేశారు. దీనిపై నాగబాబు ఓ స్పెషల్ ఎపిసోడ్ చేశారు. బాలయ్య వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమ పరువు తీశాయి అన్నారు. అలాగే తెలంగాణా గవర్నమెంట్ ని కూడా అవమానించారు అని నాగబాబు చెప్పారు. అంతే కాకుండా బాలయ్య బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక నాగబాబు ఊపు చూస్తుంటే ఈ విషయంపై మరో పది ఎపిసోడ్స్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇటీవల నాగబాబు గాంధీ అండ్ గాడ్సేలపై కొన్ని వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలిచాడు. దాని వలన ఆయనకు నెగటివ్ పబ్లిసిటీ వచ్చింది. దీనితో ఆ విషయాలపై ట్వీట్స్ వేయడం ఆపి వేశాడు. ఇక బాలయ్య ఎపిసోడ్ తో నాగబాబుకి కావలసినంత కాంట్రవర్సీ మెటీరియల్ దొరికింది.దీనితో రేపటి నుండి ఆయన వరుస ఎపిసోడ్స్ చేయడం ఖాయం కనిపిస్తుంది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus