Bigg Boss 5 Telugu: ‘బిగ్ బాస్5’ కంటెస్టెంట్స్ పై నాగబాబు స్పందన..!

Ad not loaded.

‘బిగ్ బాస్5’ కంటెస్టెంట్స్ పై తాజాగా నాగబాబు తన స్పందన తెలిపాడు. ‘బిగ్ బాస్4′ టైములో అభిజిత్‌కు సపోర్ట్ చేసాడు ఈ మెగా బ్రదర్. ఈసారి కూడా తన సపోర్ట్ ఎవరికో తెలియజేసాడు ఈ మెగా బ్రదర్.అతను మాట్లాడుతూ… ” ‘బిగ్ బాస్5’ చూస్తున్నాను.ఈసారి చాలా మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్,యానీ మాస్టర్,షణ్ముఖ్, ప్రియ వంటి వారు ఈ సీజన్ కు ఎంట్రీ ఇచ్చారు. వారితో పాటు ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ హాజరయ్యారు.

జబర్దస్త్ షోలో చేసినప్పుడు సాయి అతని పేరు. ఆ సమయంలోనే సాయి ట్రాన్స్ జెండర్లకు సాయం చేసేవాడు. తనలో ఓ సంఘర్షణ ఉండేది. లోపలి ఫీలింగ్స్ అమ్మాయిలా ఉండే.. రూపం మాత్రం అబ్బాయిలా ఉండేది. అందుకే అతను సర్జెరీ చేయించుకుని అమ్మాయిలా మారాడు’ అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. “ట్రాన్స్ జెండర్‌గా మారిన తర్వాత ‘జబర్దస్త్‌’ లో అతనికి అవకాశం లభించలేదు. తర్వాత ‘అదిరింది’ షోలో తీసుకున్నాం. స్కిట్లు బాగానే చేసింది.

ఆ తరువాత సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మరింతగా ఫాలోయింగ్ ను పెంచుకుంది. అందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఎవరు గెలిచినా హ్యాపీనే.! కానీ ప్రియాంక సింగ్ గెలిస్తే.. ఓ కమ్యూనిటీ గెలిచినట్టు అవుతుంది. గెలిచినా గెలవకపోయినా ఆమె ఎక్కువ కాలం బిగ్ బాస్ ఇంట్లో నిలదొక్కుకునేలా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి’ అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus