చైతన్య సమంత ఆ సినిమాలతో సక్సెస్ సాధిస్తారా?

  • May 1, 2023 / 11:12 AM IST

నాగచైతన్య సమంత కాంబినేషన్ టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్లలో ఒకటనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలను నమోదు చేసుకున్నాయి. నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న తర్వాత కెరీర్ పరంగా ఆశాజనకంగా ఫలితాలు రావడం లేదు. నాగచైతన్య గత రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయనే సంగతి తెలిసిందే. అందువల్ల నాగచైతన్య కెరీర్ కు కస్టడీ సినిమా కీలకం కానుంది. వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకుడు కాగా కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.

నాగచైతన్య, కృతి కాంబినేషన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందో లేదో చూడాలి. కస్టడీ సినిమాపై చైతన్య చాలా ఆశలు పెట్టుకున్నారు. ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. సమ్మర్ కానుకగా కస్టడీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమాకు కచ్చితంగా బెనిఫిట్ కలుగుతుంది. మరోవైపు సమంత విషయానికి వస్తే శాకుంతలం సినిమాతో ఆమె ఖాతాలో భారీ డిజాస్టర్ చేరింది.

సమంత ఖాతాలో గతంలో కూడా డిజాస్టర్లు ఉన్నా శాకుంతలం స్థాయిలో ఏ సినిమా డిజాస్టర్ కాలేదు. ప్రస్తుతం సమంత ఆశలన్నీ ఖుషి సినిమాపై ఉన్నాయి. శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతో నచ్చుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఖుషి సినిమా క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుండగా ఈ సినిమా ఫ్యాన్స్ తెగ నచ్చేలా ఉండనుందని తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ సమంత జోడీ బాగుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఖుషి సినిమా మైత్రీ బ్యానర్ పై తెరకెక్కుతుండగా ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus