Custody: నాగచైతన్య కస్టడీ సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ అదేనా?

  • May 9, 2023 / 12:33 AM IST

నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు తమిళ భాషలలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇలా నాగచైతన్య ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగచైతన్య కస్టడీ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సినిమా కథ నాకు వెంకట్ ప్రభు గారు చెప్పినప్పుడు ఎలాగైతే చెప్పారో తీసేటప్పుడు కూడా అలాగే తీశారని సినిమా తీసే సమయంలో ఎలాంటి మార్పులు చేయలేదని నాగచైతన్య తెలియజేశారు. ఇక ఈ సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ కస్టడీ కాదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సినిమాలో నా పాత్ర పేరు శివ. అందుకే ఈ సినిమాకి కూడా శివ అనే టైటిల్ పెట్టాలని డైరెక్టర్ భావించారు.

అయితే ఈ సినిమాకు శివ అని కనుక టైటిల్ పెడితే నాన్న నటించిన శివ సినిమాతో ఈ సినిమాకు పెద్ద ఎత్తున పోలికలు పెడతారు.అందుకే తాను ఈ సినిమాకు శివ అనే టైటిల్ వద్దని చెప్పానని నాగచైతన్య ఈ సందర్భంగా వెల్లడించారు.ఇలా శివ సినిమా అనుకున్న తర్వాత అది కాస్త క్యాన్సిల్ కావడంతో తిరిగి కస్టడీ అని టైటిల్ పెట్టామని తెలిపారు.

ఇక ఈ సినిమా (Custody) టైటిల్ కస్టడీ అని ఎందుకు పెట్టాము అనే విషయం తెలియాలంటే ఈ సినిమా పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుందని ఈ సందర్భంగా నాగచైతన్య ఈ సినిమా టైటిల్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక థాంక్యూ తర్వాత కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాగచైతన్యకు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus