Naga Chaitanya: ఆ విషయంలో నాన్నను నిందించొద్దు.. చైతన్య కామెంట్స్ వైరల్!

  • May 8, 2023 / 05:13 PM IST

అక్కినేని హీరోలతో స్టార్ డైరెక్టర్లు సినిమాలను తెరకెక్కించకపోవడం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోందనే సంగతి తెలిసిందే. కొంతమంది స్టార్ డైరెక్టర్లు సినిమాలను తెరకెక్కిస్తున్నా ఆ సినిమాలు అక్కినేని హీరోలకు ఆశించిన సక్సెస్ ను అయితే అందించడం లేదు. అయితే నాగార్జున కొడుకులపై శ్రద్ధ పెడితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అఖిల్ కు సైతం ఇదే ప్రశ్న ఎదురు కాగా ఆ ప్రశ్న గురించి సరిగ్గా స్పందించలేదు. అయితే నాగచైతన్య మాత్రం స్ట్రెయిట్ గా ఆ ప్రశ్నకు జవాబు చెప్పారు.

ఏ స్టార్ డైరెక్టర్ తో అయినా సినిమా చేయాలని కోరితే నాన్న వెంటనే సెట్ చేస్తారని చైతన్య అన్నారు. నాన్న నుంచి ఈ విషయంలో నో అనే జవాబు రాదని ఆయన తెలిపారు. నాన్న డైరెక్టర్లకు సంబంధించి చాలాసార్లు మమ్మల్ని అడిగారని చైతన్య వెల్లడించారు. స్టూడియో నుంచి అడ్వాన్స్ లు పంపిస్తానని నాన్న చాలాసార్లు చెప్పారని చైతన్య పేర్కొన్నారు. పేరెంట్స్ నుంచి తమకు పూర్తిస్థాయిలో మద్దతు ఉందని ఆయన కామెంట్లు చేశారు.

సినిమాలకు సంబంధించి ఇంట్లో చర్చ జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. నిర్ణయాలు మేమే తీసుకుంటామని ఆ నిర్ణయాలు తప్పైతే వాటి నుంచి నేర్చుకుంటామని ఆయన వెల్లడించారు. ఒకానొక సమయంలో కచ్చితంగా విజయం దక్కుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఒక ఫెయిల్యూర్ ను సొంతంగా హ్యాండిల్ చేస్తే వచ్చే అనుభవం ఎక్కడా దొరకదని చైతన్య అన్నారు.

కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చైతన్య ఈ విషయాలను వెల్లడించారు. త్వరలో నాగచైతన్య కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు. సమంత గురించి సైతం చైతన్య పాజిటివ్ గా చెప్పిన సంగతి తెలిసిందే. చైతన్య సమంత కలిస్తే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. చైతన్య సమంత విడిపోవడం అభిమనులను ఎంతగానో హర్ట్ చేసిందనే సంగతి తెలిసిందే.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus