ఈ మధ్య కాలంలో నాగ చైతన్య ఏం మాట్లాడినా.. అది సమంత కే లింక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లి అక్కడ.. ‘రోజులు మారుతున్నాయి.. పరిస్థితులు మారుతున్నాయి..కానీ మీ ఎనర్జీ మాత్రం మారడం లేదు’ అని అన్నాడు. ఇక్కడ ‘మారుతున్న పరిస్థితులు’ అంటే ఇక చైసామ్ ల విడాకులకు కనెక్ట్ అయ్యారు కొంతమంది జనాలు. అటు తర్వాత కూడా ‘నేను కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే పాత్రలు మాత్రం చేయను’ అని చైతన్య అంటే దాన్ని కూడా సమంతతో విడాకుల మేటర్ కి రిలేట్ చేసుకున్నారు.
అంతేకాదు చైసామ్ లు విడాకులు తీసుకుని ఏడాది కావస్తున్నా.. ఇంకా వారి విడాకుల వార్తల పై ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. సమంత పలు సార్లు విడాకుల పై స్పందించింది కానీ చైతన్య మాత్రం అసలు ఒక్కసారి కూడా సమంత పేరుని ప్రస్తావించలేదు. ఒకసారి టాపిక్ వస్తే.. ఇద్దరి కెరీర్ లను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు ఇద్దరం హ్యాపీ అని సరిపెట్టాడు.
ఇదిలా ఉండగా.. తాజాగా ‘థాంక్యూ’ ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ట్రైలర్ లో ‘ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమ కంటే.. స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ ఎంతో గొప్పది’ అంటూ ఓ డైలాగ్ ఉంది. దీనిని కూడా సమంతకి రిలేట్ చేసుకుని సెటైర్లు వేశారు. ఇక తాజాగా చైతన్య ‘ఆమె నా హృదయాన్ని ముక్కలు చేసి వెళ్ళిపోయింది’ అని అన్నాడు. ఆ గ్యాప్ లోనే అంతా సమంత మేటర్ కు కనెక్ట్ అయిపోయారు.
కానీ తర్వాత తన ఫస్ట్ క్రష్ గురించి అని చైతన్య క్లారిటీ ఇచ్చాడు. అతను మాట్లాడుతూ.. 8 వ తరగతిలో నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని ఇష్టపడ్డాం. కానీ ఆ విషయం నాకు తెలీదు. నా హృదయం మాత్రమే ముక్కలు చేసి ఆమె వెళ్ళిపోయింది అని నేను అనుకున్నాను అంటూ చైతన్య చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!