Naga Chaitanya: ఎమోషనల్ పోస్ట్ పెట్టి బ్యూటిఫుల్ పిక్స్ ను షేర్ చేసిన నాగ చైతన్య..!

‘మజిలీ’ ‘వెంకీ మామ’ ‘ లవ్ స్టోరీ’ ‘బంగార్రాజు’ వంటి వరుస విజయాలతో ఫుల్ ఫామ్లో ఉన్నాడు నాగ చైతన్య. త్వరలో థాంక్యూ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. బి.వి.ఎస్ రవి ఈ చిత్రానికి కథ అందించారు.

ఈ చిత్రం మెయిన్ థీమ్ ‘థాంక్యూ’ ప్రాముఖ్యత చెప్పడం. హీరోకి లైఫ్ ను మూడు దశలుగా చూపించి.. అతనికి థాంక్యూ ప్రాముఖ్యత తెలుపడం ఈ చిత్రం కథ అని స్పష్టమవుతుంది. జూలై 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో ప్రమోషన్లలో భాగంగా చైతన్య పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ‘థాంక్యూ అనే పదాన్ని నేను చాలా తక్కువగా వాడతాను.అయితే ముఖ్యమైన చోట అది తక్కువ అవుతుంది అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది.

నా నెక్స్ట్ మూవీ ‘థాంక్యూ’ నాకు ఓ మంచి ఆలోచన కలుగజేసింది. ఈ చిత్రం ప్రయాణంలో నన్ను ఏదో కదిలించింది. ఈ పోస్ట్ ను నాకు చాలా ముఖ్యమైన వ్యక్తులకి డెడికేట్ చేస్తున్నాను. ‘అమ్మ.. నన్ను టైం టు టైం నడిపించినందుకు.. నా ప్రతి అడుగులో పాజిటివ్ నెస్ ను నింపినందుకు థాంక్యూ’, ‘నాన్న..

నాకు గమ్యం చూపించినందుకు.. నాకు ఫ్రెండ్ గా ఉంటున్నందుకు థాంక్యూ’, ‘హాష్.. ఎలా ప్రేమించాలో తెలిపినందుకు, నన్ను మనిషిగా ఉంచినందుకు థాంక్యూ’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టి ఈ ఫోటోలను షేర్ చేశాడు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus