Naga Chaitanya: ఓటీటీ కోసం చైతు ప్రయత్నం!

Advertisement

అక్కినేని నాగచైతన్య ‘మజిలీ’ సినిమా నుంచి సరికొత్త కథలతో కెరీర్ లో దూసుకుపోతున్నారు. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తున్నాడు. రొటీన్, కమర్షియల్ సినిమాలకు దూరంగా నటుడిగా తనకు పేరు తెచ్చే సినిమాలనే ఒప్పుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రయోగాత్మక పాత్రలో కనిపించడానికి చైతు అంగీకరించినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ.. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

త్వరలోనే తానొక హారర్ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు చెప్పాడు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ను విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేస్తున్నారని తెలిపారు. ఈ సిరీస్ లో తను నెగెటివ్ రోల్ లో కనిపించబోతున్నట్లు చెప్పాడు చైతు. కథ చాలా ఆసక్తికరంగా ఉంటుందని.. ఓటీటీకి సరిపడే కథ అని అన్నారు. కొన్ని కథలు ఓటీటీకి మాత్రమే సూట్ అవుతాయని.. ఇది కూడా అలాంటిదే అని వివరించారు.

చాలా మంది నటులకు ప్రయోగాలు చేయాలని ఉంటుందని.. రొటీన్ కి డిఫరెంట్ గా ఉండే పాత్రల్లో కనిపించాలని ఆరాటపడుతుంటారని.. ఆ ఛాన్స్ ఓటీటీ ద్వారా దొరుకుతుందని అన్నారు. ప్రస్తుతం చైతు నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus