Naga Chaitanya: ఆ ఒక్క కారణంతోనే మహేష్ బాబును వద్దనుకున్న డైరెక్టర్!

  • September 19, 2022 / 06:45 PM IST

దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఎవర్ గ్రీన్ సినిమా ఏ మాయ చేసావే . సమంత అక్కినేని నాగచైతన్య హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతూ నటించిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా వల్ల నాగచైతన్య సమంత హీరో హీరోయిన్లుగా మంచి గుర్తింపు పొందారు. అప్పట్లో ఈ సినిమా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇప్పటికీ సమంత,

నాగచైతన్య కెరీర్ లోనే కాకుండా గౌతమ్ మీనన్ కెరీర్ లో కూడా ది బెస్ట్ సినిమా. ఈ సినిమాలో సమంత, నాగచైతన్య మధ్య ఉన్న సన్నివేశాలు యువతని బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలా నాగచైతన్య, సమంత నటించిన మొదటి సినిమా కోసం నాగచైతన్యకి బదులు వేరే స్టార్ హీరోని అనుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ మీనన్ ఈ విషయం గురించి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు.

ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ. ఏం మాయ చేసావే సినిమా స్టోరీ రాసినప్పుడు మొదటగా నాగచైతన్యకి బదులు సూపర్ స్టార్ మహేష్ బాబుని హీరోగా పెట్టాలని అనుకున్నట్లు వెల్లడించాడు. కాకపోతే మహేష్ బాబు అప్పటికి పోకిరి వంటి మాస్ సినిమాతో హిట్ అందుకున్నాడు. అందువల్ల మహేష్ బాబు ఇలాంటి క్లాస్ సినిమాలలో కాకుండా మాస్ సినిమాలో నటించాలని అనుకోవడంలో నాగచైతన్య ని సంప్రదించినట్లు వెల్లడించాడు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమాని తమిళ భాషలో కూడా విడుదల చేశారు.

అయితే తమిళ సినిమాలో శింబు, త్రిష హీరోహీరోయిన్లు గా నటించారు. తెలుగులో మాదిరిగానే తమిళంలో మన ఇంట్లో కాదా కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. మరి ఈ సినిమాలో నాగచైతన్యకు బదులు మహేష్ బాబును తీసుకుని ఉంటే సినిమా రిసల్ట్ ఎలా ఉండేదోనని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఇక ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus