Naga Chaitanya: స్టేజ్ పైనే చైతూ రొమాంటిక్ చూపులు.. వీడియో వైరల్!

ఈ సంక్రాంతి కానుకగా రాబోతున్న బంగార్రాజు సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయన కథ కు కొనసాగింపుగా రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇటీవల గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో నాగార్జున నాగచైతన్య తో పాటు మిగతా హీరోయిన్స్ కూడా వేడుకలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

అయితే ఆ వేడుకలో నాగచైతన్య ఎవరూ ఊహించని విధంగా దర్శనమిచ్చాడు. సినిమాలో బంగార్రాజు ఎలాగైతే అమ్మాయిల తో రొమాంటిక్ గా కనిపిస్తూ ఉంటాడో అదే తరహాలో స్టేజి పైన కూడా నాగచైతన్య బంగార్రాజుగా దర్శనం ఇచ్చినట్లు అనిపించింది. కాకపోతే ఈసారి కాస్త చిలిపిగా నవ్వునట్లుగా ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా 6 మంది హీరోయిన్స్ కూడా ఉన్నారు అని ఇటీవల దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.

దాంట్లో ఒకరైన దక్ష నగర్కార్ కూడా గ్లామరస్ పాత్రలో కనిపించబోతోంది. అయితే బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగచైతన్య దక్ష నగర్కార్ తో చాలా రొమాంటిక్ గా కనిపించినట్లు ఒక వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. నాగార్జున స్పీచ్ ఇస్తుండగా వెనకాల ఉన్న నాగ చైతన్య పక్కన ఉన్న దక్ష వైపు తిరిగి చూశాడు. ఆమె చాలా క్యూట్ గా నవ్వుతూ ఉండటం తో నాగచైతన్య కూడా చిలిపిగా సిగ్గుపడిపోతూ ఒక స్మైల్ ఇచ్చాడు.

ఇక ఇద్దరు అలా ఎందుకు నవ్వుకున్నారు తెలియదు గానీ అభిమానులకు మాత్రం అది చాలా రొమాంటిక్ గా అనిపించడంతో వీడియోను సోషల్ మీడియాలో బాగానే వైరల్ చేస్తున్నారు. దీంతో చిన్న బంగార్రాజు అప్పుడే మొదలు పెట్టేసాడు అంటూ నెటిజన్లు ప్రత్యేకంగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక బంగార్రాజు సినిమా జనవరి 14వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus