Naga Chaitanya: అంతా ఓకే అనుకున్నాక వాయిదా వేస్తే ఇలానే ఉంటుంది!

Advertisement

ఒకరిపై ఒకరు రివేంజ్‌ తీర్చుకోవడం మనం ఎక్కువగా సినిమాలు చూస్తుంటాం. అయితే సినిమా వాళ్లు కూడా రివేంజ్‌లు తీర్చుకుంటారా? ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ మాటే ఎక్కువగా వినిపిస్తోంది. అయితే నిజంగా రివేంజా? లేక కావాలనే అలాంటి పుకారు పుట్టించారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఆ క్లారిటీ వచ్చేలోపు అసలు ఏంటా రివేంజ్‌ స్టోరీ అనేది చూస్తే.. ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది. అది చూస్తే రివేంజ్‌ నిజమేనేమో అనిపిస్తుంది కూడా.

ఈ రివేంజ్‌ రియాక్షన్‌ సంగతి చూడాలి అంటే.. కొంచెం వెనక్కి వెళ్లాలి. ఎంత అంటే.. ‘సర్కారు వారి పాట’ సినిమా మొదలవ్వడానికి కాస్త ముందుకెళ్లాలి. ఎందుకంటే యాక్షన్‌ జరిగింది అప్పుడే అని అంటున్నారు. ‘గీత గోవిందం’ సినిమా విడుదలై మంచి విజయం అందుకున్న తర్వాత నాగచైతన్యతో ‘నాగేశ్వరరావు’ అనే సినిమా ప్రకటించారు. అప్పుడు సినిమా పేరు అధికారికంగా ప్రకటించకపోయినా సినిమా అయితే ఉంది అన్నారు. అయితే ఏమైందో ఏమో కానీ ఆ సినిమా మొదలుపెట్టకుండా ‘సర్కారు వారి పాట’ సినిమా వైపు వెళ్లిపోయారు దర్శకుడు పరశురామ్‌.

ఆ సినిమా ప్రచారంలో భాగంగా ‘నాగేశ్వరరావు’ సినిమా గురించి మాట్లాడారు పరశురామ్‌. త్వరలో సినిమా స్టార్ట్‌ అని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు నాగచైతన్యను చూస్తుంటే పరిస్థితి అలా అనిపించడం లేదు. ‘థ్యాంక్‌ యూ’ సినిమా తర్వాత పరశురామ్‌కి డేట్స్‌ ఇస్తా అని చెప్పిన చైతు… ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదట. మరోవైపు త‌మిళ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు సినిమాకు ఓకే చెప్పేశాడు చైతు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం అని అంటున్నారు.

ఆ లెక్కన ‘సర్కారు…’ కోసం పరశురామ్‌ చూపించిన యాక్షన్‌కు ఇది రియాక్షన్‌ అని చెబుతున్నారు. వెంకట్‌ ప్రభు సినిమా ఇటీవల ముహూర్తం జరుపుకుంది. కథ పూర్తిగా సిద్ధంగా ఉండటంతో ఈ సినిమా చేసి, ఆ తర్వాత పరశురామ్ సినిమా చేద్దామని అనుకుంటున్నారట నాగచైతన్య. అయితే ఇది ముందస్తు నిర్ణయం ప్రకారమే జరిగింది అని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. దీంతో యాక్షన్‌కి రియాక్షనా కాదా అనేది తెలియడం లేదు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus