Lavanya Tripathi: లావణ్య విషయంలో అలాంటి డెసిషన్ తీసుకున్న పద్మజ!

Advertisement

నటి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈమె వరుణ్ తేజ్ తో గత కొంతకాలంగా రహస్య ప్రేమ ప్రయాణం నడుపుతూ వచ్చారు. అయితే వీరి ప్రేమ గురించి వార్తలు వస్తున్నప్పటికీ ఆ వార్తలను మాత్రం ఖండిస్తూ వచ్చారే కానీ ప్రేమ విషయం గురించి ఎక్కడ ఓపెన్ అవ్వలేదు. ఇకపోతే వీరిద్దరూ తమ నిశ్చితార్థ తేదీని ప్రకటిస్తూ ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు.

ఈ విధంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా నిశ్చితార్థ వేడుక జూన్ 9వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలోనే వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరుగునున్న నేపథ్యంలో ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలుస్తుంది. ఇలా వీరి పెళ్లి పనులు జరుగుతున్న నేపథ్యంలో లావణ్య త్రిపాఠి విషయంలో నాగబాబు భార్య తీసుకున్నటువంటి ఒక షాకింగ్ డెసిషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మెగా కోడలుగా అడుగు పెట్టకముందే తన కెరీర్ గురించి పద్మజా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అందరిని సంతోషానికి గురిచేస్తుంది. అత్తలంటే వేధించే వాళ్ళు మాత్రమే కాదని తల్లిలా ప్రేమగా చూసుకునేవారు అంటూ కూడా ఈమె నిరూపించారు. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాటికి ఎలాంటి నియమ నిబంధనలు పెట్టకుండా తనకు ఇష్టం వచ్చిన విధంగా ఉండవచ్చని ఈమె తెలియజేసారట. అయితే తాను చేసే ఏ పని అయినా కూడా మెగా కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా ఉండేలా చూసుకోవాలని హెచ్చరించారట.

పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి సినిమాలలో నటించడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.అంతేకాకుండా పెళ్లయిన వెంటనే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఇద్దరు వేరుగా ఉండడం కోసం పద్మజా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట.తమతో పాటు కలిసి ఉంటే వారి ఫ్రీడమ్ కోల్పోతారని అందుకే వారి సంతోషాన్ని దృష్టిలో పెట్టుకొని ఈమె ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలియడంతో లావణ్య విషయంలో పద్మజా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus