అక్కినేని నాగార్జున ఎంతో కూల్ గా ఉండే మనిషి అనే విషయం మన అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుండి మనం ఆయనని చూస్తూనే ఉన్నాం, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు కానీ సీరియస్ గా ఉండడం మనం ఎప్పుడూ గమనించలేదు. బిగ్ బాస్ హోస్ట్ గా మారినప్పుడు మాత్రం కొన్ని కొన్ని సందర్బాలలో కోపగించుకున్నాడు. అయితే నిజ జీవితం లో కూడా ఆయన ఒకసారి ఒక విషయం లో ప్రముఖ దర్శకుడు శివ నాగేశ్వర రావు కి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట.
ఇక అసలు విషయానికి వస్తే ఇండస్ట్రీ లో సీనియర్ మోస్ట్ డైరెక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శివ నాగేశ్వర రావు, అప్పట్లో ‘సిసింద్రీ’ అనే సినిమా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో నాగార్జున చిన్న తనయుడు అక్కినేని అఖిల్ నటించాడు. చిన్నతనం లోనే బుడి బుడి అడుగులు వేసుకుంటూ ఎంతో ముద్దుగా అఖిల్ చేసిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
అయితే ఈ సినిమాని నాగార్జున తో ఒప్పించడానికి డైరెక్టర్ శివ నాగేశ్వర రావుకి తలలో ఉన్న ప్రాణం తోకలోకి వచ్చిందట. ఇలా ఇంగ్లీష్ లో సూపర్ హిట్ గా నిల్చిన ఒక సినిమాకి రీమేక్ తీస్తున్నాం, మీ అబ్బాయిని ఇందులో హీరోగా తీసుకోవాలి అని అనుకుంటున్నాను, దయచేసి ఒక 50 రోజులు మీ కొడుకుని నాకు ఇవ్వండి అన్నాడట. ఇది విన్న వెంటనే నాగార్జున ఏమి మాట్లాడుతున్నావయ్యా, అఖిల్ కి ఏడాది కూడా నిండలేదు ఇంకా, ఇప్పుడు వాడితో ఏమి సినిమా చేస్తావు, లైట్ తీసుకో అన్నాడట.
లేదు సార్ ఈ కథకి మీ అబ్బాయి అయితేనే బాగుంటుంది, అబ్బాయి మీద బెంగ వద్దు, ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత నాది అని బ్రతిమిలాడాడు అట. అప్పుడు నాగార్జున ఎట్టకేలకు ఒప్పుకొని, జాగ్రత్తగా చూసుకో, బిడ్డ మీద చిన్న గీత పడినా నిన్ను ఇండస్ట్రీ లో లేకుండా చేస్తా అని వార్నింగ్ ఇచ్చాడట నాగార్జున. అలా తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ చిత్రం ఆరోజుల్లోనే 5 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.
మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?