Rajinikanth: గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కి తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఉంది. గతంలో ఈయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే టాలీవుడ్ అగ్ర హీరోలు కూడా తమ సినిమాలను విడుదల చేయడానికి భయపడేవారు. అయితే తర్వాత పరిస్థితి మారిపోయింది. మారిన కాలానికి తగ్గట్టు రజనీకాంత్ కథల ఎంపిక సరిగ్గా లేదు అనే విమర్శలు వెల్లువెత్తాయి. ఒకవేళ కాన్సెప్ట్ సినిమా తీస్తే రజినీకాంత్ మార్క్ ఎలివేషన్స్ మిస్ అయ్యాయి అనే కంప్లైంట్స్ వచ్చేవి. దీంతో రూ.30 కోట్ల వరకు ఉండే రజనీకాంత్ మార్కెట్ ఇప్పుడు రూ.12 కోట్లకి పడిపోయింది. రజనీకాంత్ లేటెస్ట్ మూవీ ‘జైలర్’ కి కూడా రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ మాత్రమే జరిగింది. అయితే రజినీకాంత్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) కథానాయకుడు :

పి.వాసు దర్శకత్వంలో జగపతి బాబు ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో రజనీకాంత్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి కేవలం రూ.4.5 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రంలో రజినీకాంత్ రోల్ పూర్తిగా లేకపోవడంతో పోస్టర్స్ తో మోసం చేశారు అనే విమర్శలు కూడా వచ్చాయి.

2) రోబో :

రజనీకాంత్ – శంకర్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్ ముగిసేసరికి రూ.37.07 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

3) విక్రమ్ సింహా :

ఇది ఒక 3D యానిమేషన్ మూవీ. కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అయితే ఫైనల్ గా కేవలం రూ.3.2 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ అయ్యింది.

4) లింగ :

రజినీకాంత్ – కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.23 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫైనల్ గా ఈ చిత్రం రూ.16 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి ప్లాప్ గా మిగిలింది.

5) కబాలి :

రజినీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో రూ.22 కోట్ల షేర్ ను సాధించి యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

6) కాలా :

రజినీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.24 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా కేవలం రూ.9 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.

7) 2.ఓ :

రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘రోబో’ కి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రానికి రూ.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.54 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి యావరేజ్ టు ఎబౌవ్ యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.

8) పేట :

రజినీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అయితే ఫుల్ రన్లో కేవలం రూ.6.5 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి ప్లాప్ గా మిగిలింది.

9) దర్బార్ :

రజినీకాంత్ హీరోగా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.14.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి కేవలం రూ.10.09 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఫైనల్ గా ఈ మూవీ కూడా యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

10) పెద్దన్న :

రజనీకాంత్ (Rajinikanth) హీరోగా సిరుతై శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ.12.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా.. ఫైనల్ గా కేవలం రూ.4 .54 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus