తెలుగు సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీ కపుల్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అక్కినేని నాగార్జున అమల దంపతుల గురించి చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలాగే ఉన్నారు. నాగార్జున అప్పటికే దగ్గుబాటి లక్ష్మీని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత అమలను వివాహం చేసుకున్నారు. అమల నాగార్జున కలిసి పలు సినిమాలలో నటించారు. ఇలా సినిమాల సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులు తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అప్పటికే నాగచైతన్య జన్మించిన నాగార్జునకు అమలను పెళ్లి చేసుకున్న తర్వాత అఖిల్ కి జన్మనిచ్చారు. ఇలా వీరిద్దరూ తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో నాగార్జున అమల ఇద్దరు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పెళ్లి సమయంలో అమల అక్కినేని ఇంటికి తీసుకువచ్చిన కట్న కానుకల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
అక్కినేని ఇంటికి కట్నంగా ఏం తీసుకువచ్చింది అంటూ ప్రశ్న ఎదురవడంతో నాగార్జున సమాధానం చెబుతూ పలు విషయాలు తెలియజేశారు. సాధారణంగా సినిమా సెలబ్రిటీలు కట్న కానుకలు అంటే భారీ స్థాయిలోనే ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. కానీ అమల కట్నం గా తన పెళ్లి సమయంలో తన ఇంటికి రెండు కుక్కపిల్లలను తీసుకువచ్చింది అంటూ నాగార్జున తెలిపారు.
ఈ విధంగా నాగార్జున (Nagarjuna) తన కట్నం విషయంలో చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి నాగార్జున నిజంగానే అమల కట్నంగా కుక్క పిల్లలను తీసుకువచ్చిందని చెప్పారా లేకపోతే అమలకు జంతువులు అంటే ఇష్టం అని అలా చెప్పారా అనే విషయం తెలియదు కానీ ఈయన చేసినటువంటి కామెంట్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!