Nagarjuna, Akhil: కొడుకు సక్సెస్ కోసం కష్టపడుతున్న నాగ్!

అక్కినేని ఫ్యామిలీ హీరోలైన నాగార్జున, నాగచైతన్య ఇప్పటికే నటులుగా ప్రూవ్ చేసుకోవడంతో పాటు ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారనే విషయం తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీ హీరోలలో ఒకరైన అఖిల్ ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించినా ఒక్క సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో అఖిల్ సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం నాగార్జున కత్తెర పట్టారని సమాచారం.

మరో 12 రోజుల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజ్ కానుండగా నాగార్జున ఈ సినిమా కథ, కథనాల విషయంలో సలహాలు, సూచనలు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. షూటింగ్ పూర్తైన తర్వాత బెటర్ ఔట్ పుట్ కోసం కొన్ని సన్నివేశాలను రీషూట్ చేశారని తెలుస్తోంది. రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టమైన ప్రకటన రావడంతో నాగార్జున ఎడిటింగ్ మార్పులు చేశారని తెలుస్తోంది. గతంలో నాగార్జున కత్తెర పట్టి సక్సెస్ సాధించిన సినిమాలు కొన్ని ఉన్నాయి.

ఈ సినిమాను కూడా నాగ్ సక్సెస్ చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, ఈషా రెబ్బా కీలక పాత్రలు పోషిస్తున్నాయి. మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో స్టాండప్ కమెడియన్ గా కనిపించనున్నారు. ఈ పాత్రను పోషించడానికి పూజా హెగ్డే చాలా కష్టపడ్డారని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలలో హిట్టైన సినిమాలు ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా గ్యారంటీగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus