కింగ్ నాగార్జున (Nagarjuna) మరో రెండు రోజుల్లో ‘కుబేర’ (Kuberaa) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాగార్జునకి (Nagarjuna) ఒక రకంగా సెకండ్ ఇన్నింగ్స్ వంటిది ఈ సినిమా. ఇప్పటివరకు ఆయన హీరోగా సినిమాలు చేశారు. మల్టీస్టారర్లు కూడా హీరోగానే చేశారు. కానీ ‘కుబేర’ (Kuberaa) లో నాగార్జున (Nagarjuna) పాత్ర.. అతని ఇమేజ్ కి తగ్గట్టు ఉండదు అని చెప్పకనే చెప్పారు.నాగార్జున (Nagarjuna) మాత్రమే కాదు.. ఇందులో ధనుష్ (Dhanush) పాత్ర కూడా హీరో పాత్రని తలపించదట.
ఒక బాధితుడి తరహా పాత్రలానే ఉంటుందట. ఇమేజ్ కోసం ఈ పాత్రలో మార్పులు కోరితే.. ‘దీని ఒరిజినాలిటీ మిస్ అవుతుంది’ అంటూ నాగార్జున (Nagarjuna) ‘కుబేర’ (Kuberaa) ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. రజినీకాంత్ (Rajinikanth) ‘కూలీ’ (Coolie) సినిమాలో కూడా నాగార్జున (Nagarjuna) నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో ఆయన నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో నాగార్జున (Nagarjuna) నటిస్తున్నారని అంతా అనుకున్నారు. కానీ ‘అది పూర్తిగా నిజం కాదు’ అని తెలిపి నాగార్జున షాకిచ్చారు.
‘కూలీ’ (Coolie) సినిమాలో నాగార్జున (Nagarjuna) సైమన్ అనే పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన లుక్ కూడా అదిరిపోయింది. కానీ అంతకు మించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఈ పాత్ర గురించి ఎటువంటి హింట్ ఇవ్వలేదు. అయితే ‘కుబేర’ (Kuberaa) ప్రమోషన్స్ లో నాగార్జున (Nagarjuna) ‘కూలీ’ (Coolie) లో తన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చేశారు.
ఆ సినిమాలో నాగార్జున (Nagarjuna) విలన్ గా కనిపించబోతున్నారట. అలా అని అది పార్ట్ టైం విలన్ రోల్ కాదని, కంప్లీట్ విలన్ రోల్ అని చెప్పి షాకిచ్చారు నాగ్. అయితే ఆయన సినిమా మొత్తం కనిపిస్తారట. అది మేటర్. మరి ‘కూలీ’ (Coolie) నాగార్జున (Nagarjuna) పాత్రని అభిమానులు ఎంత వరకు ఓన్ చేసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.