Bangarraju Trailer: ‘బంగార్రాజు’… బాక్సాఫీస్ ను ఊచకోత కోసేలా ఉన్నాడుగా..!

Advertisement

నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా రమ్య కృష్ణ, కృతి శెట్టి.. హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. ‘జీ స్టూడియోస్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్లు కలిసి నిర్మించిన ఈ చిత్రం 2016లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా తెరకెక్కింది.జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమా పై భారీ అంచనాలు నమోదయ్యేలా చేసాయి.

తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ‘సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ అనే క్యాప్షన్ కు తగ్గట్టుగానే ఈ ట్రైలర్ కూడా చాలా జల్సా చేయించే విధంగా ఉంది.నాగార్జున మరియు నాగ చైతన్య అటు రొమాంటిక్ ఎపిసోడ్స్ లో కానీ ఇటు యాక్షన్ సన్నివేశాల్లో కానీ ఇరక్కొట్టేశారు అని చెప్పాలి.స్వర్గంలో దేవదూతలతో రొమాన్స్ చేస్తూ ఉన్న బంగార్రాజు… మళ్ళీ తన కుటుంబంలో ఓ సమస్య తలెత్తడంతో భూమి మీదికి వస్తాడు.

ఇక్కడ సత్యభామ (రమ్యకృష్ణ) కూడా మరణించి ‘బంగార్రాజు’ పక్కన చేరినట్టు హింట్ ఇచ్చారు. ఇక చిన బంగార్రాజు గా కనిపిస్తున్న నాగ చైతన్య.. తన తాత లానే దర్జాగా జల్సాలు, సరసాలు చేసుకుంటూ బాధ్యత లేకుండా తిరుగుతాడు.కృతి శెట్టి ఓ పల్లెటూరి అమ్మాయి నాగ లక్ష్మి పాత్రలో కనిపిస్తుంది. ట్రైలర్ లోని అన్ని అంశాలు ఆకట్టుకునే విధంగానే అనిపిస్తున్నాయి. నాగార్జున చెప్పినట్టు ఇది నిజంగా పండగలాంటి సినిమా అనే ఫీల్ ను కలుగజేస్తూ ట్రైలర్ ను వదిలారు. ఈ ట్రైలర్ సినిమా పై ఉన్న అంచనాల్ని డబుల్ చేసిందనే చెప్పాలి. మీరు కూడా ఓ లుక్కేయండి :

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!


ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news