Wild Dog: నాగ్ సినిమాపై పైరసీ ఎఫెక్ట్!

Advertisement

మరికొన్ని గంటల్లో సీనియర్ హీరో నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా యూఎస్ లో ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఆ తరువాత ఇండియాలో సినిమా కానుంది. ఈ సినిమా రిజల్ట్ కోసం చిత్రబృందం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకుండానే పైరసీకి గురవ్వడం షాకిస్తుంది. పైరసీ సినిమాలను అప్లోడ్ చేసే ఓ వెబ్ సైట్ వాళ్లు ‘వైల్డ్ డాగ్’ సినిమాను కూడా అప్లోడ్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. ‘వైల్డ్ డాగ్’ అని పేరు పెట్టి మరో సినిమా ఏదైనా పోస్ట్ చేశారా అని అనుకోవడానికి లేదు.

ఎందుకంటే సినిమాలోని కొన్ని షాట్లకు సంబంధించిన విజువల్స్ ను స్క్రీన్ షాట్ లుగా తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి ట్రైలర్ లో చూపించిన సీన్స్ అయితే కాదు. అన్నీ కొత్త సన్నివేశాలని తెలుస్తోంది. దీంతో ‘వైల్డ్ డాగ్’ సినిమా పైరసీ ప్రింట్ ఇంటర్నెట్ లో వచ్చిన మాట నిజమని తెలుస్తోంది. దీంతో నాగ్ ఫ్యాన్స్ వెంటనే నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ను అలర్ట్ చేశారు. వారు పైరసీ వెబ్ సైట్ నుండి లింక్ ను తీయించారు.

ఇంకా ఎక్కడైనా లింక్ లు కనిపిస్తే తమకు వెంటనే చెప్పాలని పిలుపునిచ్చారు. గతంలో ‘అత్తారింటికి దారేది’ సినిమా విషయంలో కూడా ఇలానే జరిగింది. ఆ సినిమా చిత్రబృందంలో ఒకరే సినిమాను లీక్ చేశారని తేలింది. ‘వైల్డ్ డాగ్’ విషయంలో కూడా ఇలానే జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కొంతకాలంగా హిట్స్ లేక డీలా పడ్డ నాగ్.. ఈ సినిమాపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా పైరసీ కావడం ఆందోళలకు గురిచేస్తుంది.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus