కృష్ణ, మహేష్ లపై నమ్రత స్పెషల్ పోస్ట్

  • August 30, 2017 / 12:37 PM IST

అలనాటి అందమైన తెలుగు హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. ముఖ్యంగా అమ్మాయిల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉండేది. అదే విధంగా ఆయన తనయుడు మహేష్ బాబు ఇప్పుడు అమ్మాయిల్లో ఎక్కువ అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆ విషయాన్నీ రెండు ఫొటోలతో నమ్రత చక్కగా చెప్పారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే మహేశ్‌బాబు భార్య నమ్రత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోరెండు ఫొటోలను పోస్ట్‌ చేశారు. అందులో సూపర్‌స్టార్‌ కృష్ణ యువకుడిగా ఉన్నప్పటి ఫొటో ఒకటి కాగా, ‘స్పైడర్‌’ షూటింగ్‌ స్పాట్‌లో మహేశ్‌ దిగిన ఫొటో మరొకటి. ఈ రెండింటిలో వారిద్దరూ ఒకే ఫోజులో ఉండడం స్పెషల్.

తండ్రికి తగ్గ తనయుడిని సింపుల్ గా కామెంట్ రాయకుండా .. “అప్పుడు.. ఇప్పుడు. మా లెజెండరీ మామగారు, ఆయన అందమైన కుమారుడు”అని నమ్రత క్యాప్షన్‌ ఇచ్చి ఘట్టమనేని అభిమానుల్లో సంతోషాన్ని నింపారు. ఈ అరుదైన ఫోటోలు సోషల్ మీడియాలో లైక్లు, షేర్లతో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం మహేష్ స్పైడర్ సినిమాలో మిగిలిగిన ఓ పాత షూటింగ్ నిమిత్తం రొమేనియాలో ఉన్నారు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus