కన్నీటిని ఆపుకోలేకపోయిన నాని

నేచురల్ స్టార్ నాని సినిమాలోనే కాదు బయట కూడా పక్కింటి కుర్రోడిలాగానే ఉంటారు. అందరితో సింపుల్ గా కలిసిపోతారు. అలాగే చిత్ర యూనిట్ సభ్యులందరితో స్నేహితుడిగా మెలుగుతారు. ప్రస్తుతం అతను నాగార్జునతో కలిసి “దేవదాస్” అనే మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గతవారం వరకు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రస్తుతం బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే కేరళలో వరద బీభత్సం చిత్ర బృందాన్ని విషాదంలో ముంచివేసింది. ఈ సినిమాకు ఛాయాగ్రహణం అందిస్తున్న శాందత్ కేరళ వాసి. శాందత్ కుటుంబం కూడా కేరళ లోనే ఉండడంతో అతని కుటుంభ సభ్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న శాందత్ కన్నీరుమున్నీరయ్యారు. ఇక తన సినిమాటోగ్రాఫర్ సెట్ లో ఏడవడం చూసి నాని కన్నీటిని ఆపుకోలేకపోయారు. అందరి ముందు ఏడ్చేశారు. “అక్కడివారి పరిస్థితిని తెలుసుకొని చాలా బాధపడ్డాను. వారు సురక్షితంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే వారి కోసం మనకు తోచిన సాయం చేయాలి” అని నాని ట్వీట్ చేశారు. నాని ట్వీట్ కంటే ముందే తెలుగు చిత్ర పరిశ్రమనుంచి అనేకమంది స్టార్స్ కేరళకు ఆర్ధికసాయాన్ని అందజేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus