నాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ సైంధవ్ సినిమా కూడా త్వరలో రానున్న నేపథ్యంలో నాని వెంకటేష్ ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా నాని వెంకటేష్ ఇద్దరు కూడా పలు విషయాల గురించి వెల్లడించారు.
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. సినిమాలలో ఎమోషన్ సీన్స్ చేయడం కొంతమందికి మాత్రమే బాగుంటుందని అందరూ హీరోలు ఇలాంటి ఎమోషన్స్ సన్ని వేశాలలో నటిస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేరని తెలియజేశారు. కానీ మనం ఇద్దరం ఎమోషన్స్ సీన్స్ చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుంది అంటూ ఈ సందర్భంగా వెంకటేష్ తెలిపారు. ఇది మనకు ఒక బహుమతి అంటూ తెలిపారు.
ఈ మాటలకు నాని (Nani) మాట్లాడుతూ..మన ఇద్దరిలో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయని తెలిపారు. కామెడీ, ఎమోషన్, మాస్.. ఈ మూడింటిలో మిమ్మల్ని అంగీకరించినట్లే నన్ను కూడా అంగీకరించారు. ఇది మనిద్దరికీ దొరికిన వరం సార్ అంటూ నాని ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక వెంకటేష్ నటించిన సినిమా కూడా తండ్రి కూతుర్ల అనుబంధం నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వీరిద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు.
ఇక ఇద్దరి హీరోలు కూడా ఎన్నో కామెడీ సినిమాలలోను అలాగే ఎమోషనల్ సినిమాలు మాస్ సినిమాలు కూడా చేశారు. దీంతో ఇద్దరు హీరోలలో ఈ మూడు కామన్ పాయింట్స్ ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా వెంకటేష్ నాని గుర్తు చేసుకున్నారు. మరి డిసెంబర్ ఏడో తేదీ రాబోతున్నటువంటి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.
యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!
దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!