Nani: అలా జరిగితే నాని కెరీర్ కు ఇబ్బందులు తప్పవా?

  • January 28, 2023 / 06:16 PM IST

సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ నానికి ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. నాని రెమ్యునరేషన్ ప్రస్తుతం 20 కోట్ల రూపాయలుగా ఉంది. గతేడాది అంటే సుందరానికి సినిమాతో నాని హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది దసరా సినిమాతో నాని ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 65 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కిందనే సంగతి తెలిసిందే. మార్చి నెల 30వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే నాని మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ నెల 31వ తేదీన నాని కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ సినిమాకు ఎన్నారై సి వి మోహన్ నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం. నానికి జోడీగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు.

శౌర్య అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా క్రేజ్ ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో నాని నటిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కెరీర్ ను నాని రిస్క్ లో పెడుతున్నాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నానికి ప్రస్తుతం కెరీర్ పరంగా భారీ హిట్ అవసరం అనే సంగతి తెలిసిందే.

నాని నటించిన దసరా సినిమాకు ఏకంగా 70 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. నాని రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండటం వల్లే బడ్జెట్ మరింత పెరగకుండా కొత్త డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్ల గురించి నాని ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus