‘క్యాస్టింగ్ కౌచ్’ ఎప్పటినుండో మనం వింటున్న పదమే ఇది. సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతో మంది ఆడవాళ్ళం మోసపోయాం అంటూ ఎప్పటినుండో దీని పై పోరాటం జరుగుతూనే ఉంది. ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలనుకునే వాళ్ళనో లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు అవ్వాలనుకుంటున్న వారిని కొంతమంది పడకగదిలోకి వస్తేనే కానీ.. అవకాశాలు ఇవ్వరని శ్రీ రెడ్డి లాంటి వాళ్ళు గొంతెత్తి అరిచారు. ‘మీటూ’ అంటూ ఎన్నో ఉద్యమాలు కూడా నడిచినా.. అది ముందుకు వెళ్ళింది లేదు. ఏదో పబ్లిసిటీ కోసమే పనిగట్టుకుని ఇలా గొడవ చేస్తున్నారు అనే కామెంట్స్ కూడా వస్తూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా హీరోయిన్ మాధవీ లత కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. తనీష్ ‘నచ్చావులే’, నాని ‘స్నేహితుడా’ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె మహేష్ బాబు ‘అతిధి’ సినిమాలో కూడా కీలక పాత్ర చేసింది. తరువాత ఎందుకో సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్న ఈ బ్యూటీ 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నుండీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ.. “కమిట్‌మెంట్ అనేది చాలా పవిత్రమైన పదం. కానీ దాన్ని ఇండస్ట్రీలో మనోళ్ళు ఇలా మార్చేశారు. కమిట్మెంట్ అంటే ఇప్పుడు పడుకోవడం అనే అర్థానికి దిగజార్చారు.నిజానికి కమిట్మెంట్ అంటే ఒప్పుకున్న పని పూర్తి చేయడం. కానీ ఇండస్ట్రీలో మాత్రం కమిట్మెంట్ అంటే పడుకోవడానికి వస్తావా అన్నట్లు మార్చేశారు. నాకు కూడా ఈ ఇబ్బందులు ఎదురయ్యాయి.. అప్పట్లో నన్ను కూడా కమిట్మెంట్ అడిగారు. అయితే నేను ఒప్పుకోలేదు. పడకగదిలోకి వెళ్ళకపోతే ఎవ్వరూ మన ట్యాలెంట్ ను గుర్తించరు. ఇండస్ట్రీలో కూడా ఉండడం అసాధ్యం.” అంటూ చెప్పుకొచ్చింది మాధవీ లత.
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!