ఎన్టీఆర్ భార్యతో బాలయ్య కూతురు బ్రహ్మణి..వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • February 11, 2023 / 11:15 AM IST

జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు అంటూ చాలా సార్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే హరికృష్ణ మరణం తర్వాత బాలయ్య … కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లను చేరదీసారు.ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ అయ్యే వరకు బాగానే కలిసున్నారు . కానీ ఆ తర్వాత మళ్లీ దూరంగా ఉంటూ వచ్చారు. రాజకీయాల పరంగా నారా , బాలయ్య కుటుంబంతో ఎన్టీఆర్ కు వైరం ఏర్పడినట్టు కథనాలు వినిపించాయి.

అయితే గతేడాది నుండీ బాలయ్య కూతురు బ్రహ్మణి… జూనియర్ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఆమె బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ వేశారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తో కలిసి కనిపించారు. హుస్సేన్ సాగర్ వద్ద ఫార్ములా ఈ- కార్ రేసింగ్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రేసును ప్రత్యక్షంగా వీక్షించడానికి నారా బ్రాహ్మణి- లక్ష్మీ ప్రణతి కలిసి వెళ్లారు.

బ్రాహ్మణి కొడుకు దేవాన్ష్ తో కలిసి హాజరుకాగా, లక్ష్మీ ప్రణతి ఒంటరిగానే వెళ్లారు. దీంతో ఇద్దరూ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది.అయితే వీళ్లిద్దరూ కలిసి అమిగోస్ స్పెషల్ స్క్రీనింగ్ కూడా వెళ్లినట్టు వినికిడి.ఏదేమైనా ఈ ఫోటోలు నందమూరి అభిమానులకు కన్నుల పండుగగా అనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు.

 

 

 

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus