తనను టార్చర్ చేసిన ప్రియుడి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ‘నరసింహ నాయుడు’ హీరోయిన్..!

సినిమా రంగంలో హీరోయిన్ల దగ్గరినుండి మొదలు క్యారెక్టర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్స్, జూనియర్ ఆర్టిస్టులు.. అందరూ ఏదో ఒక సందర్భంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారే.. తమని ఇబ్బందులకు గురి చేసిన వారిపై బహిరంగంగా కామెంట్స్ చేశారు కొందరు హీరోయిన్లు.. ఈ నేపథ్యంలో హాలీవుడ్‌లో స్టార్ట్ అయిన మీటూ ఉద్యమం ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే.. ఇటీవలే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తనను ఎలా టార్చర్ చేసేవాడో ఒకప్పటి నటి, ఆయన మాజీ ప్రేయసి సోమీ అలీ వివరించింది..

ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ యాక్ట్ చేసి ఆడియన్స్‌ని ఆకట్టుకున్న ఆశా సైనీ అలియాస్ ఫ్లోరా సైనీ తన మాజీ ప్రియుడి గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు అందర్నీ షాక్‌కి గురిచేశాయి.. 2007లో తన బాయ్ ఫ్రెండ్ గౌరంగ్ జోషి.. చిత్రహింసలకు గురిచేశాడని.. తీవ్రమైన లైంగిక వేధింపులకు కూడా పాల్పడాడ్డని వెల్లడించింది.. 2018లో మీటూ ఇష్యూ టైంలో కొన్ని విషయాలు చెప్పిన ఆశా.. తాజాగా మరో ఇంటర్వ్యూలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది.

‘శ్రద్ధా వాకర్‌కు ఎలాంటి పరిస్థితి అయితే ఎదురైందో నా విషయంలో కూడా అలాంటిదే జరిగింది. నా బాయ్ ఫ్రెండ్, నన్ను నా కుటుంబం నుంచి దూరం చేశాడు. ఇంటి నుంచి నేను బయటకొచ్చిన కొద్ది రోజుల్లోనే అతడి ప్రవర్తనలో చాలా మార్పు కనిపించింది. తనకోసం అందరినీ వదిలేసి వస్తే.. నన్ను తీవ్రంగా హింసించేవాడు. పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తించేవాడు. ఎందుకు కొడుతున్నాడో అర్థమయ్యేది కాదు. ఓ రోజైతే.. అతడి కొట్టిన దెబ్బలకు నా దవడ విరిగింది.

ఇంకోసారి దారుణంగా కొట్టడంతో చనిపోతాననుకున్నా. ఒంటిపై బట్టలు ఉన్నాయా లేదా అని కూడా చూడకుండా ప్రాణభయంతో పరుగులు పెట్టా.. తర్వాత రోజే తన మీద కేసు పెట్టాను. మొదట పోలీసులు నా మాటలు నమ్మలేదు. రాత పూర్వక కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదు చేసుకున్నారు’ అని చెప్పుకొచ్చింది..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus