Naresh, Pavitra: మళ్లీ రిపీట్ కాబోతున్న నరేష్ పవిత్ర కాంబో … అస్సలు తగ్గట్లేదుగా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి వారిలో నటుడు నరేష్ పవిత్ర లోకేష్ జంట ఒకటి అని చెప్పాలి. వీరిద్దరూ లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగి తేలడమే కాకుండా సహజీవనం చేస్తూ ఉన్నారు.ఇదివరకే పవిత్ర వివాహం జరిగిన తన భర్తను పిల్లలను వదిలి ఈమె నరేష్ వద్దకు వచ్చారు. ఇక నరేష్ కూడా ఇదివరకే మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురు భార్యలకు దూరంగా ఉంటున్నారు. అయితే వీరిద్దరూ సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగుతూ పలు సినిమాలలో నటించారు.

ఇలా పలు సినిమాలలో నటించే సమయంలో ఇద్దరు మధ్య పరిచయం, ప్రేమ ఏర్పడటం జరిగింది. అయితే వీరిద్దరూ లేటు వయసులో పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడమే కాకుండా ఇద్దరు కలిసి రిలేషన్ లో ఉన్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇకపోతే వీరిద్దరూ మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాని నరేష్ తన వ్యక్తిగత జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు.

ఈ సినిమా స్వయంగా (Naresh) నరేష్ నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వీరిద్దరూ పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ చేసిన హంగామా మామూలుగా లేదని చెప్పాలి.అయితే ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకోవడమే కాకుండా నరేష్ భారీగా నష్టాలను కూడా ఎదుర్కొన్నారని తెలుస్తుంది.

ఈ విధంగా ఈ సినిమాకు నష్టాలు వచ్చినప్పటికీ వీరిద్దరూ బాగా పాపులర్ కావడంతో తిరిగి ఇద్దరి కాంబినేషన్లో మరికొన్ని సినిమాలు కూడా చేయాలి అన్న ఆలోచనలో నరేష్ ఉన్నట్టు తెలుస్తోంది. నరేష్ తల్లి విజయ్ నిర్మల స్థాపించిన విజయ్ కృష్ణ బ్యానర్ తిరిగి ఈయన మళ్లీ పెళ్లి సినిమా ద్వారా ప్రారంభించారు. ఈ బ్యానర్ ద్వారా నరేష్ పవిత్ర లోకేష్ జంటగా మరికొన్ని సినిమాలు చేయాలన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే త్వరలోనే వీరి సినిమాలను ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus