శర్వానంద్ హీరోగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari). ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని హడావిడిగా 2026 సంక్రాంతి బరిలో దింపుతున్నారు మేకర్స్. ‘సామజవరగమన’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు రామ్ అబ్బరాజు చేసిన సినిమా కావడంతో ప్రత్యేకతని సంతరించుకుంది ‘నారీ నారీ నడుమ మురారి’. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.కొద్దిసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు
ఈ టీజర్ విషయానికి వస్తే ఇది 1:59 నిమిషాల నిడివి కలిగి ఉంది. టీజర్ ఆరంభంలోనే కమెడియన్ సత్యని చూపించి కామెడీకి ప్రిపేర్ అయ్యేలా చేశారు. ‘ఇంతకీ నీ పేరు ఏంటి?’ అంటే ‘లవ కుశ.. లవ్ కోసం ఎంత దూరమైన వెళ్తాను’ అంటూ సత్య వేసే పంచ్ డైలాగ్ బాగానే ఉంది. ఆ తర్వాత సంపత్ కి, శర్వాకి మధ్య వచ్చే కన్వర్జేషన్ కూడా బాగానే ఉంది. మొత్తానికి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ మధ్య నలిగిపోయే హీరోగా శర్వానంద్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.
ఈ సినిమాలో కూడా సీనియర్ నరేష్ కామెడీ హైలెట్ అయ్యేలా ఉంటుంది అని దర్శకుడు రామ్ అబ్బరాజు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ టీజర్లో మాత్రం సీనియర్ నరేష్ ని ఏమాత్రం హైలెట్ చేయలేదు. కొన్ని పంచులు ఫోర్స్డ్ గా అనిపించాయి. టీజర్ ని కూడా హడావిడి గా కట్ చేసినట్టు ఉన్నారు. కొన్ని డైలాగ్స్ డబ్బింగ్ లేకుండా అలాగే క్లారిటీ లేకుండా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి చూడండి :