Aay, Double Ismart: జూనియర్ ఎన్టీఆర్ బావమరిది ఆ సినిమాను మించిన హిట్ అందుకుంటారా?

  • June 26, 2024 / 01:54 PM IST

ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల కావాల్సిన పుష్ప ది రూల్ మూవీ వాయిదా పడటంతో చాలా సినిమాలు ఆ తేదీకి రిలీజ్ కావడానికి ఫిక్స్ అయ్యాయి. డబుల్ ఇస్మార్ట్ (Double Ismart)    ఇప్పటికే ఆ తేదీకి రిలీజ్ కానుండగా తాజాగా ఆ జాబితాలో నార్నే నితిన్ (Narne Nithin) హీరోగా తెరకెక్కుతున్న ఆయ్ మూవీ చేరింది. అయితే డబుల్ ఇస్మార్ట్ కు పోటీగా ఆయ్ సినిమాను రిలీజ్ చేయడంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) బావమరిది నార్నే నితిన్ మ్యాడ్ (MAD)సినిమాతో హిట్ అందుకున్నా ఆ సినిమా సక్సెస్ కు వేర్వేరు కారణాలు ఉన్నాయి. లాంగ్ వీకెండ్ ఉండటంతో ఎక్కువ సినిమాలు ఆ తేదీని టార్గెట్ చేసుకోగా సినిమాల రిలీజ్ సమయానికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేము. ప్రస్తుతం ఏ సినిమా హిట్ కావడానికి అయినా కంటెంట్ ముఖ్యమనే సంగతి తెలిసిందే. ఆయ్ సినిమాతో నార్నె నితిన్ ప్రేక్షకుల మెప్పు పొందుతారేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తలు.

గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా అంజి కంచిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ఆయ్ మూవీ అప్ డేట్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆగష్టు 15వ తేదీ గురువారం కాగా వీకెండ్ తర్వాత వచ్చే సోమవారం రాఖీ పండుగ కావడం గమనార్హం. నయన్ సారిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారని తెలుస్తోంది.

రామ్ మిరియాల ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆయ్ సినిమాకు ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేస్తే మాత్రం ఈ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ఒకింత ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఆయ్ సినిమా ఇతర భాషల్లో సైతం విడుదలవుతుందేమో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus