నేషనల్ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ గారిని నందమూరి బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ వేడుకలకు ఆహ్వానం అందించడం జరిగింది

నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. నేషనల్ అవార్డు గ్రహీత ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ గారిని కలిసి తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించిన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, తెలంగాణ స్టేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ అనుపమ రెడ్డి గారు, మా అసోసియేషన్ నుండి మాదాల రవి గారు, శివ బాలాజీ గారు, నిర్మాత ముత్యాల రామదాసు గారు.

ఈ సందర్భంగా ఆహ్వానించడానికి వచ్చిన సినీ పెద్దలతో అల్లు అర్జున్ గారు సానుకూలంగా స్పందిస్తూ బాలకృష్ణ గారి గురించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకోవడం జరిగింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus