నయనతార మళ్ళీ సూపర్ హిట్ కొట్టింది

  • August 18, 2018 / 01:22 PM IST

తమిళంలో స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ & మార్కెట్ ఉన్న కథానాయిక నయనతార. నిన్నమొన్నటివరకు హీరోయిన్ గా మాత్రమే నటిస్తూ వచ్చిన ఈ అమ్మడు ఈమధ్య కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ హీరోగానూ మారింది. కొంతకాలంగా నటనకి ఎక్కువ ప్రాధాన్యత గల సినిమాలను చేస్తూ .. తన స్థాయిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళుతోంది. ఆమె తాజా చిత్రంగా రూపొందిన ‘కొలమావు కోకిల’ నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కథా భారాన్ని నయనతార పూర్తిగా తనపై వేసుకుని ముందుకు నడిపిస్తూ వెళ్లింది. తొలిరోజునే ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ టాక్ తెచ్చేసుకుంది.

నయనతార నటన పట్ల అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘లేడీ సూపర్ స్టార్’ అనే బిరుదును ఈ సినిమాతో ఆమె సార్థకం చేసుకుందంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. 25 కోట్ల రూపాయల ఖరీదు చేసే డ్రగ్స్ ను తన కుటుంబ సభ్యులతో కలిసి నయనతార ఎలా తరలించిందనే కథాంశంతో ఈ సినిమా కొనసాగుతుంది. కావలసినంత కామెడీని కలుపుకుని సాగే థ్రిల్లర్ మూవీ ఇది. త్వరలో ‘కో కో కోకిల’ అనే పేరుతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus