Nayanthara: నయనతార లుక్‌ లీక్‌.. కానీ ఇంత క్వాలిటీగా ఉందేంటి?

  • July 8, 2023 / 01:45 PM IST

సినిమాల నుండి లుక్‌లు రావడం, లీక్‌లు రావడం కామనే. ఎంత కాదనుకున్నా, వద్దనుకున్నా లీక్‌లు వచ్చేస్తుంటాయి. ఇక లుక్‌లు అంటారా? వాళ్లు కావాలి అనుకుంటనే వస్తాయి. అయితే లుక్‌లు లీక్‌ అవ్వడం మాత్రం టీమ్‌కి కాస్త ఇబ్బందే. ఎంతో జాగ్రత్తగా ఎవరి కంటా పడకుండా దాచి.. ఆ లుక్‌లు రిలీజ్‌ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు అవి బయటకు వచ్చి టీమ్‌ను ఇబ్బంది పెడుతుంటాయి. సినిమాలో ఫలానా హీరో / హీరోయిన్‌ ఎలా ఉంటారు అనే కుతూహలం ఆ లీక్‌ వల్ల పోవడమే కారణం.

అయితే లీకులందు రెండు రకములు, ఒకటి కావాలని చేసిన లీక్‌, రెండో వద్దనుకున్నా అయిన లీక్‌. ఇప్పుడు ‘జవాన్‌’ సినిమా నుండి ఓ ఫొటో లీక్‌ అయ్యింది. ఆ సినిమాలో కథానాయికగా నటించిన నయనతార ఫొటో అది. షారుఖ్‌ ఖాన్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజాగా ఫొటో బయటకు వచ్చింది. (Nayanthara) నయన్‌ అదిరిపోయే లుక్‌లో కనిపించి వావ్‌ అనిపించింది.

అయితే ఈ ఫొటో లీక్‌ అయ్యిందా? మరి ఇంత క్వాలిటీతో ఉందేంటి? అంటూ కొన్ని కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే టీజర్‌తో సినిమా ప్రచారానికి కిక్‌ స్టార్ట్‌ చేద్దాం అనుకున్న టీమ్‌కి ఈ లీక్‌ చికాకు పెట్టేదే అంటున్నారు ఇంకొంతమంది. లీకైన లుక్ లో నయనతార కర్లీ హెయిర్‌, రెడ్ షర్ట్ అండ్ పింక్ కలర్ సూట్‌తో కనిపించింది. అయితే ఈ లుక్ ‘జవాన్’ సినిమాలోదేనా? కాదా? అనే డౌట్‌ కూడా ఉంది.

యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ‘జవాన్‌’ సినిమాలో విజయ్ సేతుపతి, ప్రియమణి, సునీల్ గ్రోవర్, యోగిబాబు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొణె గెస్ట్ రోల్‌లో నటిస్తోంది. జూలై 12న ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కానుంది. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో సినిమాను రిలీజ్‌ చేస్తారట.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus