Nayanthara: షూటింగ్ కి చార్టెర్ట్ ఫ్లైట్ లో వస్తోన్న హీరోయిన్!

  • April 28, 2021 / 05:00 PM IST

దక్షిణాది స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది నయనతార. ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ.. ఇప్పటికీ లేడీ సూపర్ స్టార్ గా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లతో పోలిస్తే నయనతారకి ఇచ్చే రెమ్యునరేషన్ రెండింతలు ఎక్కువే ఉంటుంది. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే అమ్మడు మాములుగా డిమాండ్ చేయదు. దానికి తగ్గట్లే తన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో నయనతార నేల మీద కంటే విమానాల్లోనే ఎక్కువగా తిరుగుతుంది.

హైదరాబాద్ లో జరుగుతున్న ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ కోసం నయనతార ప్రత్యేకమైన విమానంలో వచ్చింది. స్టార్ హీరోలు, టాప్ సెలబ్రిటీలు చార్టెర్ట్ ఫ్లైట్స్ లో తిరగడం కామనే కానీ అదంతా హీరోల వరకే పరిమితం. ఓ సౌత్ హీరోయిన్ ఇలా షూటింగ్ లకు వ్యక్తిగతమైన విమానాల్లో రావడం నయనతారతోనే మొదలైందని చెప్పాలి. ఆ మధ్య తన ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్లింది నయన్. అప్పుడు కూడా ఇలా స్పెషల్ ఫ్లైట్ లోనే ప్రయాణించింది.

కరోనా భయం ఓ పక్క.. ప్రైవసీ మరోపక్క. అందుకే నయనతార ఇలా విమానాల్ని నమ్ముకుంది. ఈమె జోరు చూస్తుంటే త్వరలోనే ఓ విమానాన్ని కొనేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని.. కోలీవుడ్ మీడియా వార్తలు ప్రచురించింది. భారీ రెమ్యునరేషన్ తీసుకునే నయన్ కి ఓ ఫ్లైట్ కొనడం పెద్ద విషయమేమీ కాదులెండి. నయన్ రేంజ్ చూసి చాలా మంది తారలు ఆశ్చర్యపోతున్నారట. ఇక మన హీరోలు కూడా ఇలాంటి చార్టెర్ట్ ఫ్లైట్స్ లోనే తిరిగుతారేమో!

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus