Nayanthara, Vignesh: భార్యతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్లిన విగ్నేష్?

Advertisement

గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో మునిగిపోయిన నయనతార విఘ్నేష్ శివన్ దంపతులు ఈ ఏడాది జూన్9వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా ప్రముఖ సెలబ్రిటీలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి వేడుకను జరుపుకున్నారు.ఇలా గత కొంతకాలం నుంచి ప్రేమలో విహరిస్తున్న ఈ జంట వారి గురించి వస్తున్న వార్తలకు పెళ్లి బంధంతో చెక్ పెట్టారు. ఇక పెళ్లి తర్వాత పలు దైవ దర్శనాలు చేసుకున్న ఈ జంట అనంతరం హనీమూన్ కోసం థాయిలాండ్ వెళ్లారు.

ఇక థాయిలాండ్ నుంచి తిరిగి వచ్చిన ఈ జంట ఎవరి సినిమా పనులతో వాళ్ళు బిజీగా ఉండిపోయారు. ఇకపోతే పెళ్లయిన తర్వాత వీరికి ఏమాత్రం సమయం దొరికిన వెంటనే విదేశాలకు వెళుతూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నయనతార దంపతులు మరోసారి హాలిడే వెకేషన్ వెళ్ళినట్టు తెలుస్తుంది.ఈ సందర్భంగా విగ్నేష్ శివన్ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

నయనతార దంపతులు స్పెషల్ లగ్జరీ ఫ్లైట్ లో సెల్ఫీలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ‘నా వైఫ్‌తో బార్సిలోనా వెళ్తున్నాను’ అని రాసు కొచ్చారు. దీంతో ఈ జంట తమ సమయాన్ని ఏకాంతంగా గడపడం కోసం స్పెయిన్‌లోని బార్సిలోనా పట్టణానికి పయనమయ్యారనీ తెలుస్తుంది.ప్రస్తుతం విగ్నేష్ శివన్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే ఈమె పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరమవుతుందని అందరూ భావించారు. అయితే పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఈమె అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఈమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus