తమిళంలో ఫ్లాపైన సినిమా తెలుగులో హిట్ అవుతుందా ?

  • October 11, 2019 / 05:24 PM IST

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ఓ తమిళ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకొంటున్నారు. నయనతార నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ విడుదలవుతాయి.. ఇందులో కొత్త ఏముంది అనుకొంటున్నారా. ఇక్కడ విషయం ఏమిటంటే.. ఆమె నటించిన ఆ తమిళ చిత్రం ఆల్రెడీ తమిళంలో ఫ్లాప్ ఐయింది. తమిళంలో నయనతార, హిందీలో తమన్నా నటించిన ఈ బైలింగువల్ సినిమాకు “ఈనాడు, బిల్లా 2” ఫేమ్ చక్రి తోలేటి దర్శకుడు. రెండు భాషల్లోనూ ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.

ఇప్పుడు తమిళ వెర్షన్ ను తెలుగులో “వసంత కోకిల” అనే పేరుతొ అనువాద రూపంలో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు అంత అర్జెంట్ గా ఈ చిత్రాన్ని తెలుగులో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనేది అర్ధం కాని ప్రశ్న. నయనతార ప్రమోషన్స్ కి రాదు, ఆమె ఉంది కదా అని జనాలు థియేటర్లకు పరిగెట్టుకుంటూ కూడా రారు. ఆమె నటించిన “కో కో కోకిల” సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చినా.. జనాలు మాత్రం ఆ సినిమాను చూసింది లేదు. మరి నిర్మాతలు ఈ ఫ్లాప్ సినిమాతో ఎందుకు రిస్క్ చేస్తున్నారు అనేది వారికే తెలియాలి.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus