Prashanth Neel: ఆ విషయంలో కేజీఎఫ్ డైరెక్టర్ మారితే బెటర్!

  • April 12, 2022 / 04:02 PM IST

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఉగ్రమ్, కేజీఎఫ్ ఛాప్టర్1 సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ ఛాప్టర్2 మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీ ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటోంది. అయితే ప్రశాంత్ నీల్ హీరోయిన్ల ఎంపిక బాలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాలలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు. శ్రీనిధికి బదులుగా స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేసి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరింత మెరుగ్గా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సలార్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా ప్రశాంత్ నీల్ శృతి హాసన్ ను ఎంపిక చేశారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎంపికయ్యే సమయానికి శృతిహాసన్ కు ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గింది. మరోవైపు శృతిహాసన్ సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తుండటం ప్రభాస్ అభిమానులను బాధిస్తోంది.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో హీరోయిన్ గా దీపికా పదుకొనే ఎంపికయ్యారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈమె ఎంపిక విషయంలో తారక్ అభిమానులు సైతం సంతృప్తితో లేరనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కు ఎవరైన యంగ్ జనరేషన్ స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాకు క్రేజ్ పెంచే హీరోయిన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ కామెంట్ల విషయంలో ప్రశాంత్ నీల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

సినిమాసినిమాకు ప్రశాంత్ నీల్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. వరుస విజయాలతో ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ కూడా అంచనాలను అందని స్థాయిలో పెరిగిందని తెలుస్తోంది. కేజీఎఫ్2 సినిమాతో ప్రశాంత్ నీల్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus