Neha Shetty: విశ్వక్, అంజలి నాతో అలా ఉంటారు.. నేహాశెట్టి ఏమన్నారంటే?

  • May 28, 2024 / 10:29 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన నేహాశెట్టి (Neha Shetty)  వరుస విజయాలు సాధిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలకు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వరుస సినిమాలలో నటిస్తున్న ఈ బ్యూటీ ఆ సినిమాలతో సత్తా చాటుతున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari)  సినిమాలో నేను పోషించిన రోల్ ఇప్పటివరకు చేసిన రోల్స్ తో పోల్చి చూస్తే భిన్నమైన రోల్ అని ఆమె తెలిపారు. ఈ సినిమాలో బుజ్జి రోల్ లో నటించానని కళ్లతోనే ఎక్స్ ప్రెషన్స్ పలికించే పాత్రలో నేను కనిపించనున్నానని నేహాశెట్టి వెల్లడించారు.

విశ్వక్ సేన్ తో కలిసి నటించడం ఆనందాన్ని కలిగిస్తోందని ఆమె పేర్కొన్నారు. విశ్వక్ సేన్ (Vishwaksen) ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడని తీవ్రమైన ఎండలో ఈ సినిమా షూటింగ్ చేశామని నేహాశెట్టి కామెంట్లు చేశారు. అంజలి (Anjali)  గారు సరదాగా ఉంటారని ఆమె చెప్పుకొచ్చారు. ఆమె నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని రాజమండ్రి ఫుడ్ కూడా ఎంతో బాగుంటుందని నేహాశెట్టి పేర్కొన్నారు. ఎవరైనా రాధిక అని పిలిస్తే చాలా సంతోషంగా అనిపిస్తుందని నేహాశెట్టి తెలిపారు.

పాత్ర పేరుతో మనల్ని పిలవడం అనేది గొప్ప ప్రశంస అని ఆమె పేర్కొన్నారు. కెరీర్ తొలినాళ్లలొనే రాధిక అని పేరు తెచ్చుకోవడం సంతోషం అని నేహాశెట్టి వెల్లడించడం గమనార్హం. షూట్ సమయంలో విశ్వక్, నేను మంచి ఫ్రెండ్స్ అయ్యామని అందువల్ల షూట్ సమయంలో ఎలాంటి ఇబ్బంది పడలేదని నేహాశెట్టి పేర్కొన్నారు. అభిమానంతో రాధిక అని పిలవడాన్ని నేను గౌరవంగా భావిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.

వాన పాటల్లో కనిపించే ఛాన్స్ రావడం లక్ గా భావిస్తానని నేహాశెట్టి తెలిపారు. త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్ తో (Bellamkonda Sai Sreenivas) ఒక సినిమా చేయబోతున్నానని ఆమె పేర్కొన్నారు. నేహాశెట్టి వరుస విజయాలు సాధించి కెరీర్ పరంగా కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus