సాయి అభ్యంకర్.. ఇంకా టాలీవుడ్‌లోకి స్ట్రయిట్ ఎంట్రీ ఇవ్వలేదు కానీ తమిళంలో స్టార్ అయిపోయారు. ఆయన సంగీతం కోసం యువత ఫుల్ వెయిటింగ్. అలాగే హీరోలు, దర్శకులు కూడా వెయిటింగ్. ఎందుకంటే ఆయన చేతిలో ఇప్పుడు అన్నేసి సినిమాలు ఉన్నాయి మరి. అయితే ఆయన సంగీతంతో మాత్రమే కాదు.. సింగిల్స్‌తో కూడా తనెంత స్పెషల్ అనేది ఆయన తరచూ చెబుతూనే ఉన్నారు.
అలా చేతి నిండా సినిమాలు ఉన్న సాయి అభ్యంకర్ మరో సింగిల్‌కి రెడీ అవుతున్నారని సమాచారం. త్వరలోనే ఆ పాట చిత్రీకరణ ఉంటుంది అని చెబుతున్నారు. ఇప్పటివరకు స్టార్ హీరోయిన్లు, కొత్త యంగ్ హీరోయిన్లతో సింగిల్స్ చేస్తూ వచ్చిన సాయి అభ్యంకర్.. ఈసారి కూడా యంగ్ హీరోయిన్‌నే ఆయన సెలక్ట్ చేసుకున్నారు. అయితే ఆమె ఫ్లాప్‌లో ఉన్న హీరోయిన్ కావడం గమనార్హం. ఆమెనే నేహా శెట్టి. ‘అదేనండీ టిల్లు గర్ల్ ఫ్రెండ్ రాధిక’
నిజానికి సాయి అభ్యంతకర్ గత పాట విషయంలోనూ అదే జరిగింది మరి. ‘రాధిమా..’ మీరు చూసే ఉంటారు. భాగ్యశ్రీ భోర్సే ఆ పాటలో సాయి పక్కన డ్యాన్స్ చేసింది. ఆ పాట తర్వాత ఆమె కెరీర్‌లో తొలిసారి విజయం అందుకోవడం గమనార్హం. దీంతో ఇప్పుడు నేహా శెట్టికి కూడా విజయం వస్తుందా అనే చర్చ నడుస్తోంది. తెలుగులో కాకపోయినా తమిళంలో అయినా ఛాన్స్‌లు వస్తాయేమో చూడాలి. ఎందుకంటే సాయితో డ్యాన్స్‌లు వేసిన ప్రీతి ముకుందన్, మీనాక్షి చౌదరి, శాన్వీ మేఘన, కయాదు లోహర్, భాగ్యశ్రీ భోర్సే తమిళ ఛాన్స్‌లు బాగా పట్టేశారు ఆ తర్వాత.
శివకార్తికేయన్ హీరోగా రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా, లారెన్స్ ‘బెంజ్’, ధనుష్ ‘ఓం’, అల్లు అర్జున్ ‘రాకా’, సూర్య సినిమా, శింబు 51వ సినిమా, కార్తి కొత్త సినిమా, ధ్రువ్ విక్రమ్ కొత్త ప్రాజెక్ట్, ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా మమిత బైజు నటిస్తున్న చిత్రం. తమిళ్ మురుగన్ – ధనుష్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.