Neha Shetty: నేహా శెట్టి స్టైల్‌ అదిరిపోయిందిగా.. ఏ హీరోయిన్‌కీ సాధ్యం కాని విధంగా!

  • August 19, 2023 / 09:28 PM IST

హీరోయిన్లలో ఓవర్‌ నైట్‌ స్టార్‌లు కొందరు ఉంటే… ఓవర్‌ ఇయర్‌ స్టార్‌లు అని కూడా కొందరు అంటారు. అంటే ఫస్ట్‌ సినిమా రిలీజ్‌ అయ్యి.. ఆ తర్వాత కొన్ని నెలలకు స్టార్‌ వైబ్స్‌ వచ్చేవాళ్లు ఉంటారు. ఇప్పుడు టాలీవుడ్‌లో అలాంటి హీరోయిన్‌ ఎవరైనా ఉన్నారా అంటే… నేహా శెట్టి అని చెప్పాలి. గతేడాది ‘డీజే టిల్లు’లో రాధికగా కుర్రకారును గుండెల్ని కొల్లగొట్టిన నేహా.. ఆ తర్వాత మూడు సినిమాలు ఓకే చేసేసింది. కానీ ఏవీ వెంటనే రాలేదు. ఇప్పుడు మూడూ ఒకేసారి సిద్ధమవుతున్నాయి.

దీంతో టాలీవుడ్‌లో ఎటు చూసినా (Neha Shetty) ఆమెనే కనిపిస్తోంది. ‘మునగారు మేల్‌ 2’ అనే సినిమాతో 2016లో సినిమాల్లోకి వచ్చిన నేహా శెట్టి ఆ తర్వాత 2018లో ‘మెహబూబా’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మూడేళ్లకు ‘గల్లీ రౌడీ’ సినిమాతో మళ్లీ కనిపించింది. అదే ఏడాది ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ సినిమాలో ఓ పాత్ర చేసింది. అయితే ఇవేవీ సరైన పేరు తీసుకురాలేదు. కానీ ‘డీజే టిల్లు’తో మాంచి పేరు తెచ్చుకుంది.

ఆ క్రేజ్‌లో ‘బెదురులంక 2012’, ‘రూల్స్‌ రంజన్‌’, ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ఓకే చేసేసింది. ఇప్పుడు ఆ మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కార్తికేయతో ‘బెదురులంక 2012’ చేయగా, కిరణ్ అబ్బవరంతో ‘రూల్స్ రంజన్’ చేసింది. ఇక విశ్వక్‌సేన్‌తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఇటీవల పూర్తి చేసింది. ఈ మూడు సినిమాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె డ్యాన్స్‌ గురించే మాట్లాడుతున్నారు. ‘సమ్మోహనుడా..’ సాంగ్‌ కానీ, మొన్న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ కోసం స్టేజీ మీద విశ్వక్‌సేన్‌తో చేసిన డ్యాన్స్‌ కానీ..

ఇలా అన్నీ పాటలతోనే ముడిపడి ఉన్నాయి. అలా పాటలతో మత్తెక్కించి.. టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మారిపోయింది నేహా శెట్టి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలు క్లిక్‌ అయినా, కనీసం వాటిలో ఆమె పాత్ర క్లిక్‌ అయినా ఇక నేహా శెట్టిని ఎవరూ ఆపలేరు అని అంటున్నారు. మరి ఏం అవుతుందో, ఏం చేస్తుందో చూడాలి. ‘బెదురులంక’ వాయిదాల తర్వాత ఈ నెల 25న వస్తుండగా… మిగిలిన రెండు సినిమాలు వచ్చే నెలలో విడుదలవుతాయి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus