Nenu Student Sir Collections: ‘నేను స్టూడెంట్ సర్’ మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Advertisement

‘స్వాతిముత్యం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి పాస్ మార్కులు వేయించుకున్నాడు బెల్లంకొండ గణేష్. అతను హీరోగా రూపొందిన రెండో సినిమా ‘నేను స్టూడెంట్ సర్’. రాకేష్‌ ఉప్పలపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.

యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్ ఓకే అనిపించాయి. జూన్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మొదటి రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.06 cr
సీడెడ్ 0.02 cr
ఆంధ్ర 0.05 cr
ఏపీ+ తెలంగాణ టోటల్ 0.13 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.02 cr
వరల్డ్ వైడ్ టోటల్ 0.15 cr

‘నేను స్టూడెంట్ సర్’ (Nenu Student Sir) చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.1.8 కోట్లు. మొదటి రోజు ఈ సినిమా కేవలం రూ.0.15 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు రూ.1.65 కోట్లు షేర్ ను రాబట్టాలి. ఓపెనింగ్స్ అయితే డల్ గానే ఉన్నాయి. వీకెండ్ ముగిసేసరికి ఎలా ఉంటాయో చూడాలి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus