Nenunnanu Collections: నేనున్నాను కి 18 ఏళ్ళు… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే…!

Advertisement

అక్కినేని నాగార్జున హీరోగా వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నేనున్నాను. 2004 లో విడుదలైన ఈ చిత్రంలో శ్రీయ, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. కామాక్షి మూవీస్ బ్యానర్ పై డి. శివప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఈ చిత్రం పై మొదటి నుండీ మంచి బజ్ ఏర్పడింది. ఈ క్రమంలో 2004 వ సంవత్సరం ఏప్రిల్ 7 నన విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

నాగార్జున ని ఓ పక్క మాస్ గా చూపిస్తూనే మరోపక్క సినిమాని అంత క్లాస్ గా ఫ్యామిలీస్ కు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు సినిమాని తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 18 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

మరి ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 5.05 cr
సీడెడ్ 1.70 cr
ఉత్తరాంధ్ర 2.08 cr
ఈస్ట్ 0.89 cr
వెస్ట్ 0.84 cr
గుంటూరు 1.03 cr
కృష్ణా 1.01 cr
నెల్లూరు 0.61 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 13.21 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.81 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 14.02 cr

నేనున్నాను చిత్రానికి రూ.11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.14.02 కోట్ల షేర్ ను రాబట్టి.. బయ్యర్లకు రూ.3 కోట్ల వరకు లాభాలను అందించింది. ఆ టైంలో నాగార్జునకి వరుసగా ఇది 4వ హిట్ కావడం విశేషం.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus