ఈ ఏడాది జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నయన్.. ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క బిజినెస్ తో బిజీ బిజీగా మారింది. ఇక పెళ్లి తరువాత నయన్ లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. స్కిన్ షో చేయడం, లిప్ కిస్ లు, ముద్దులు.. ఇలా అన్ని పూర్తిగా మానేసింది. అందుకు నిదర్శనం జవాన్. బాలీవుడ్ సినిమా .. అంటే ఓ రేంజ్ లో స్కిన్ షో ఉంటుంది.
సినిమా మొత్తం కాకపోయినా కనీసామ్ ఒక సాంగ్ లోనైనా హీరోయిన్ బికినీలో కనిపించాలి. కానీ, ఈ చిన్నది మాత్రం జవాన్ లో బికినీ కాదుకదా కనీసం స్కిన్ షో చేసే ఎలాంటి డ్రెస్ కూడా వేసుకోలేదు. ఈ సినిమాలోనే కాదు.. పెళ్లి తరువాత ఆమె బయట కనిపించినా కూడా స్టైలిష్ లుక్ లో కనిపిస్తూనే.. స్కిన్ షో లేని డ్రెస్ లతో మెప్పిస్తుంది.తాజాగా నయనతార.. ఎల్లే మ్యాగజైన్ కవర్ పై మెరిసింది. అంతకుముందు ఎప్పుడు ఈ భామ (Nayanthara) సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిచింది లేదు.
కానీ, ఇప్పుడు మాత్రం కవర్ పేజీలపై కనిపిస్తూ షేక్ చేసింది. ఇక ఈ మ్యాగజైన్ కవర్ లో కూడా ముద్దుగుమ్మ స్కిన్ షో అనేది లేకుండా కనిపించింది. ఇక ఈ ఫోటోలు చూసి అభిమానులు అవాక్కవుతున్నారు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో .. ఏ డ్రెస్ వేసినా కూడా తలైవి.. అదరగొట్టింది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు..
డ్రెస్సింగ్ విషయంలో.. మీరో వర్గానికి ఇన్స్పిరేషన్ మేడమ్.. అని చెప్పుకొస్తున్నారు. పెళ్లి తరువాత కూడా బికినీలు వేసుకొని బీచ్ ల వెంట తిరిగే హీరోయిన్లు ఉన్నారు. వారిలా కాకుండా.. పెళ్లి తరువాత ఆహార్యం మొత్తం మార్చుకొని.. కనిపించడం చాలా గ్రేట్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు