Balakrishna: బాలయ్య కామెంట్లపై నెటిజన్ల రియాక్షన్ ఇదే.. ఏమైందంటే?

  • May 29, 2024 / 04:45 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ వయస్సు పెరుగుతున్నా అందరితో సరదాగా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య (Balakrishna) మాట్లాడుతూ నేహాశెట్టి (Neha Shetty) కత్తి అంజలి (Anjali) ఖతర్నాక్ అని కామెంట్లు చేశారు. నారీ నారీ నడుమ మురారి అంటూ స్టార్ హీరో బాలకృష్ణ తన సినిమా టైటిల్ గురించి ప్రస్తావించడం గమనార్హం. బాలయ్య సరదాగా చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలయ్య అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు.

బాలయ్య ఏదైనా సినిమా ఈవెంట్ కు హాజరైతే ఆ సినిమా హిట్ అని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య ఈవెంట్ కు హాజరు కావడం వల్ల చిన్న సినిమాలు, మిడిల్ రేంజ్ సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి. అంజలితో ఇప్పటికే నటించిన బాలయ్య నేహాశెట్టితో భవిష్యత్తులో నటిస్తారేమో చూడాల్సి ఉంది. బాలయ్య బాబీ (Bobby) కాంబో మూవీ నుంచి ఈ నెల 10వ తేదీన అప్ డేట్ వస్తుందని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చేశారు.

టైటిల్ గురించి, టీజర్ గురించి ఆ తేదీన క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బాలయ్య పుట్టినరోజున అఖండ సీక్వెల్ కు సంబంధించి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో చూడాల్సి ఉంది. బాలయ్య బాబీ మూవీ రిలీజ్ గురించి కూడా స్పష్టత వస్తుందేమో చూడాలి. ఈ ఏడాది దసరా పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కానుందని ప్రచారం జరుగుతుండగా నందమూరి ఫ్యాన్స్ మాత్రం దేవర, బాలయ్య బాబీ సినిమా పోటీ పడే అవకాశాలు అయితే తక్కువని చెబుతున్నారు.

30 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న బాలయ్య టాలీవుడ్ సీనియర్ హీరోలలో నంబర్2 స్టేజ్ లో ఉన్నారు. బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీ రేంజ్ లో పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus