Naga Babu: ట్విట్టర్ లో నాగబాబు రీఎంట్రీపై నెటిజన్ల రియాక్షన్ ఇదే!

మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu)  ట్విట్టర్ అకౌంట్ ను డీయాక్టివేట్ చేసిన 48 గంటల్లో మళ్లీ అకౌంట్ ను యాక్టివేట్ చేసుకున్నారు. కొన్నిరోజుల క్రితం నాగబాబు సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ సంచలనం అయిన సంగతి తెలిసిందే. నాగబాబు చేసిన ట్వీట్ విషయంలో బన్నీ (Allu Arjun)  ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. బన్నీ ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్, విమర్శలు ఎక్కువ కావడంతో అల్లు అర్జున్ రియాక్ట్ అయినట్టు కొన్ని ఫేక్ పోస్టులు నెట్టింట వైరల్ అయ్యాయి.

అయితే ఈ గొడవకు కారణమైన ట్వీట్ ను డిలీట్ చేశానంటూ నాగబాబు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పోస్ట్ పెట్టారు. అయితే ఏం డిలీట్ చేశారు? అంటూ కొందరు అభిమానులు వ్యంగ్యంగా రియాక్ట్ అవుతున్నారు. నాగబాబు ఇకపై ట్విట్టర్ లో వివాదాస్పద ట్వీట్స్ కు దూరంగా ఉంటే మంచిదని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాగబాబు ఆవేశంలో అలా ట్వీట్ చేసి ఉండవచ్చని నెటిజన్లు చెబుతున్నారు. నాగబాబు గతంలో బన్నీకి ఒక సందర్భంలో సహాయం కూడా చేశారని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.

మెగా, అల్లు ఫ్యాన్స్ కలిసికట్టుగా ఉండాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగబాబు ప్రస్తుతం పరిమిత సంఖ్యలో సినిమాలో నటిస్తున్నారని సమాచారం అందుతోంది. నాగబాబు పాలిటిక్స్ కు ప్రాధాన్యత ఇస్తారో సినిమాలకు ప్రాధాన్యత ఇస్తారో తెలియాల్సి ఉంది. మరోవైపు బన్నీ మాత్రం ఈ ఘటన విషయంలో సైలెంట్ గానే ఉంటున్నారు.

స్పందిస్తే కొత్త తలనొప్పులు వస్తాయని భావించి ఆయన రియాక్ట్ కావడం లేదు. అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూట్ పనులతో బిజీగా ఉండగా ఆగష్టు నెల 15వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. పుష్ప ది రూల్ సెకండ్ సింగిల్ ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండనుందని సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరిగింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus