Nidhhi Agerwal: ఆ పార్ట్ కు నిధి సర్జరీ చేయించుకుందట.. ట్రోలింగ్ షురూ

సినిమాల్లో రాణించాలి అనుకునే వారు సర్జరీలు వంటివి చేయించుకుంటారు అనే చర్చలు తరచూ జరుగుతూనే ఉంటాయి. అది నిజం కూడా. తమ అందాన్ని మరింత పెంచుకోవడం కోసం హీరోలు, హీరోయిన్లు సర్జరీలు చేయించుకుంటారు. హీరోల్లో చాలా మందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అందుకోసం వారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేయించుకుంటారు. ఇక హీరోయిన్లు అయితే తమ ముఖానికి సర్జరీలు వంటివి చేయించుకుంటూ ఉంటారు. సమంత, శృతి హాసన్, కృతి శెట్టి వంటి స్టార్ హీరోయిన్లు ఎంతో మంది ఇలా సర్జరీలు చేయించుకోవడం జరిగింది.

తాజాగా ఈ లిస్ట్ లో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) కూడా చేరినట్టు తెలుస్తుంది. సవ్య సాచి చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ -క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘హరి హర వీర మల్లు’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. మరోపక్క తమిళంలో కూడా వరుస సినిమాల్లో నటిస్తోంది.

ఇక ఇటీవల నిధి అగర్వాల్ తన పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందట. ఇటీవల ఆమె తన పెదాలు ఫోకస్ అయ్యేలా ఓ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో పెదాలు లావుగా ఉన్నాయని, వాటికి సర్జరీ చేయింకుంది నిధి అగర్వాల్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అది నిజమని ఆమె కన్ఫర్మ్ చేసింది లేదు. అయినా ‘ఇవన్నీ అవసరమా నిధి నీకు’ .. అంటూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది నెటిజన్లు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus