Anasuya: అనసూయపై మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్.. ఏమైందంటే?

  • October 6, 2022 / 08:09 PM IST

టాలీవుడ్ స్టార్ యాంకర్లలో ఒకరైన అనసూయ ఈ మధ్య కాలంలో వరుసగా మెగా హీరోల సినిమాలలో ఆఫర్లను సొంతం చేసుకుంటూ ఆ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ సినిమాలో అనసూయ చిన్న పాత్రలో కనిపించగా ఆ పాత్ర అనసూయకు మంచి పేరును తెచ్చిపెట్టింది. అయితే గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్లలో అనసూయ ఎక్కడా కనిపించలేదనే సంగతి తెలిసిందే. అనసూయ ప్రమోషన్లకు హాజరు కాకపోవడంలో వింతేమీ లేకపోయినా గాడ్ ఫాదర్ ప్రమోషన్లకు హాజరు కాకపోవడానికి అనసూయ చెప్పిన కారణం మాత్రం సిల్లీగా ఉంది.

సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నానని అందుకే గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ కు రాలేదని అనసూయ చెప్పగా కొంతమంది నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ అనసూయ కామెంట్లపై సీరియస్ అవుతున్నారు. నువ్వేమైనా స్టార్ హీరోయిన్ అనుకుంటున్నావా? అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవి పోషించిన బ్రహ్మ పాత్రను జైలుకు పంపించే పాత్రలో అనసూయ నటించగా అనసూయ ప్రమోషన్స్ కు హాజరై ఉంటే ఆమెకు కెరీర్ పరంగా ప్లస్ అయ్యి ఉండేది.

పెద్ద సినిమాల ప్రమోషన్లలో పాల్గొనకపోతే ఆ ప్రభావం అనసూయ కెరీర్ పై కూడా పడే ఛాన్స్ అయితే ఉంది. ఇటీవల పలు వివాదాలలో చిక్కుకోవడం ద్వారా అనసూయ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అనసూయ పుష్ప ది రూల్ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ మధ్య కాలంలో అనసూయ రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తోంది. అనసూయ సినిమాలలో గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ అభినయంతో ప్రేక్షకులను మెప్పించే పాత్రలకు ఓకే చెబుతున్నారు.

అనసూయ టీవీ షోలకు దూరం కావడంతో ఆమె అభిమానులు ఒకింత ఫీలవుతున్నారు. అనసూయ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అనసూయ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ సాధించాలని ట్రోలింగ్ కు దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus