Anupama Parameswaran: అనుపమను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కానీ?

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన సినీ కెరీర్ లో ఎక్కువగా అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటించారు. కెరీర్ తొలినాళ్లలో గ్లామరస్ రోల్స్ లో నటించే ఛాన్స్ వచ్చినా ఆ ఆఫర్లను ఈ బ్యూటీ సున్నితంగా రిజెక్ట్ చేశారని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీకి లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ బ్యూటీ నటించిన రౌడీ బాయ్స్ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఇప్పటికే రిలీజైన రౌడీ బాయ్స్ ట్రైలర్ యువతను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. స్టార్ హీరోలు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ సినిమా సక్సెస్ కావడానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే రౌడీ బాయ్స్ ట్రైలర్ లో అనుపమ ఈ సినిమాలో హీరోగా నటించిన అశిష్ కు లిప్ లాక్ ఇవ్వడం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

ఇప్పటివరకు లిప్ లాక్ సీన్లకు దూరంగా ఉన్న అనుపమ పరమేశ్వరన్ యంగ్ హీరోతో లిప్ లాక్ సీన్ లో నటించడం ఆమె అభిమానులకు సైతం నచ్చలేదు. డబ్బు కోసమే అనుపమ లిప్ లాక్ సీన్ కు ఓకే చెప్పిందని నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. భారీ పారితోషికం ఇస్తే యంగ్ హీరోలకు లిప్ లాక్ ఇచ్చేస్తావా? అంటూ నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు. పారితోషికం కోసం ఇంతలా దిగజారటం కరెక్ట్ కాదని అనుపమ కామెంట్లు చేశారు.

ఈ సినిమాలో మొత్తం 5 లిప్ లాక్ సీన్లు ఉన్నాయని తెలుస్తోంది. జనవరి 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా శ్రీహర్ష కన్నెగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తొలి సినిమాతో అశిష్ రెడ్డి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus