Samantha: సమంతపై నెటిజన్ల దారుణమైన ట్రోల్స్.. ఏం జరిగిందంటే?

  • April 25, 2023 / 01:15 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత మయోసైటిస్ నుంచి కోలుకుని వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శాకుంతలం సినిమా ఫలితం సమంతకు భారీ షాకిచ్చింది. ఎంతో కష్టపడి సమంత ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నా ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడం ఆమెను నిరాశకు గురి చేసింది. ప్రస్తుతం సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ షూట్ లో పాల్గొంటున్నారు.

లండన్ లో తాజాగా సిటాడెల్ ప్రీమియర్ కార్యక్రమం జరగగా ఆ కార్యక్రమంలో సమంత సరికొత్త లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఖరీదైన నగలు ధరించి వేదికపై సమంత మెరిశారు. సమంత వేదికపై మాట్లాడుతూ సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. అయితే సమంత స్పీచ్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సమంత (Samantha) యాక్సెంట్ గురించి నెటిజన్లు స్పందిస్తూ ఈ ఫేక్ యాక్సెంట్ నీకు అవసరమా సమంత అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. విదేశాలకు వెళ్లినంత మాత్రాన యాస మార్చాల్సిన అవసరం లేదని సమంత ఓవరాక్షన్ చేస్తోందంటూ కొందరు నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తుండటం గమనార్హం. ఈ కామెంట్లపై సమంత నుంచి ఏ విధంగా రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. గతంలో పలువురు టాలీవుడ్ హీరోలను యాక్సెంట్ విషయంలో నెటిజన్లు ఇదే విధంగా ట్రోల్ చేశారు.

మరోవైపు సమంత తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి అనే సినిమాలో నటిస్తున్నారు. శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నెల 1వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఖుషి సినిమాతో సమంతకు పూర్వ వైభవం వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ, సమంత, శివ నిర్వాణ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus