పురాణాలతో సినిమా అంటే చాలా జాగ్రత్తగా తీయాలి.నియమనిష్టలు చాలా ముఖ్యం. ఏదైనా తేడా వస్తే హిందూ పెద్దలు సహించరు. ‘ఆదిపురుష్’ (Adipurush) విషయంలో ఇది ఏ రేంజ్ కి వెళ్లిందో అందరూ చూశారు. బాలీవుడ్ నిర్మాతలతో ప్రభాస్ (Prabhas) చేసిన స్ట్రైట్ ప్రాజెక్టు ఇది. ‘తానాజీ’ తో వంద కోట్ల కొట్టిన ఓం రౌత్ (Om Raut) దర్శకుడు. దాదాపు రూ.600 కోట్లు బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీసినట్టు బాలీవుడ్ మీడియా చెప్పుకొచ్చింది. కానీ ఆ బడ్జెట్ కి తగ్గట్టు విజువల్స్ ఏమీ కనిపించలేదు సినిమాలో..! వి.ఎఫ్.ఎక్స్ చాలా నాసిరకంగా అనిపిస్తాయి.
ఓ కార్టూన్ సినిమా చూసిన ఫీలింగే అడుగడుగునా కలుగుతుంది. పోనీ కథ, కథనాలు ఏమైనా ఆకట్టుకున్నాయా అంటే అవి ఇంకా ఘోరం. ప్రభాస్.. రాముడి గెటప్ సెట్ అవ్వలేదు. ‘రామాయణం’ తీస్తున్నప్పుడు ఎంత శ్రద్ధతో తీయాలి. ఓం రౌత్ తీసిన ఆదిపురుష్ చాలా అశ్రద్దతో తీసినట్టే అనిపిస్తుంది. రావణాసురుడు వాహనం గబ్బిలం చూపించడం, అతి సుందరమైన రావణ లంకని హాలీవుడ్ సినిమాల్లోని బూతు బంగ్లాలని చూపించడం, రావణాసురుడు తన వాహనానికి మటన్ తినిపించడం, హనుమంతుని పాత్రతో మాస్ డైలాగులు చెప్పించడం..
ఇలా ఒక్కటేంటి.. ఓం రౌత్ చేసిన పొరపాట్లు చాలా ఉన్నాయి.అందువల్ల నార్త్ లో సినిమా బాగా ఆడుతున్న టైంలో.. కేసులు వేసి అక్కడ ఆదిపురుష్ ని నిషేదించేలా చేశారు. అయితే ఈరోజు సినిమా వచ్చింది. ఇందులో కూడా మైథలాజికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ నాగ్ అశ్విన్ ఎంతో శ్రద్ధతో తీశాడు. సైన్స్ ఫిక్షన్ ని జోడించిన తీరు కూడా బాగుంది. మహాభారతంలోని ఎలిమెంట్స్ ఇంకాస్త ఉంటే బాగుణ్ణు అని జనాలు ఆశించారు.
అన్నిటికీ మించి క్వాలిటీ విజువల్స్ కనిపించాయి ఈ సినిమాలో..! తెలుగు దర్శకుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో సినిమా తీయగలడు అని మరోసారి రుజువైంది. అందుకే పనిలో పనిగా ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్ ని మరోసారి ట్రోల్ చేసేందుకు రెడీ అయ్యారు నెటిజన్లు.
Babu @omraut okasari bayataki ra nayana neetho pani padindi. #OmRout #Adipurush #KalkiReview #Kalki28989AD #Kalki2898 pic.twitter.com/T8PhvYkgK0
— Phani Kumar (@phanikumar2809) June 27, 2024