Kalki 2898 AD: రిలీజ్ కి కొన్ని గంటల ముందు సర్ప్రైజులు లీక్ చేసేసిన ప్రభాస్

మరికొన్ని గంటల్లో ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ (Prabhas)  హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. అశ్వినీదత్ (C. Aswani Dutt) , ప్రియాంక దత్(Priyanka Dutt) , స్వప్న దత్ (Swapna Dutt)..లు కలిసి ఈ చిత్రాన్ని రూ.500 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)  , కమల్ హాసన్ (Kamal Haasan) వంటి బడా స్టార్స్ కూడా ఈ సినిమాలో నటించడం..

దీపికా పదుకోనె కూడా ఇందులో భాగం కావడంతో అందరిలో ఆసక్తి పెరిగింది. ప్రమోషన్లు ఏమాత్రం నిర్వహించకపోయినా .. ‘కల్కి..’ కి ఓ రేంజ్లో బజ్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయనే చెప్పాలి. అంతా బాగానే ఉంది కానీ.. రిలీజ్ కి కొన్ని గంటల ముందు ప్రభాస్ ‘కల్కి..’ లోని సర్ప్రైజ్,,లు లీక్ చేసి షాకిచ్చాడు. కొద్దిసేపటి క్రితం ‘కల్కి..’ దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin), ప్రభాస్..లు ఇన్స్టా లైవ్లో పాల్గొని ‘కల్కి..’ గురించి డిస్కస్ చేసుకున్నారు.

ఈ క్రమంలో ‘కల్కి..’ లో నటించినందుకు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) , దుల్కర్ (Dulquer Salmaan)..లకు థాంక్స్ అంటూ చెప్పేశాడు. ఇప్పటివరకు వీళ్ళు నటిస్తున్నట్టు టాకైతే ఉంది కానీ దర్శకుడు నాగ్ అశ్విన్ వాటి గురించి ప్రకటించలేదు. థియేటర్లలో చూసి ఆడియన్స్ సర్ప్రైజ్ ఫీలవ్వాలనేది అతని ఆలోచన కావచ్చు. అలాగే ఈ సినిమాకి పార్ట్ 2 ఉంటుందని కూడా టీం అధికారికంగా ప్రకటించలేదు. ప్రభాస్ ఆ విషయాన్ని కూడా లీక్ చేస్తూ.. ‘పార్ట్ 2 ఉండబోతుందని’ చెప్పేశాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus